హీరో శర్వానంద్ త్వరలో ఓ ఇంటివాడు కానున్నారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా వర్క్ చేస్తున్న రక్షితారెడ్డిని శర్వా వివాహం చేసుకోనున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ప్రారంభంలో వీరి ఎంగేజ్మెంట్ జరిగింది. హైదరాబాద్‌లో జరిగిన వేడుకలో ఇరు కుటుంబసభ్యులు, ప్రముఖుల సమక్షంలో వీళ్లిద్దరూ ఉంగరాలు మార్చుకున్నారు. కాగా గత కొద్దిరోజులుగా శర్వానంద్, రక్షితల ఎంగేజ్మెంట్ బ్రేక్ అయిపోయిందని, శర్వా వివాహం వాయిదా వేసుకున్నాడనే వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అయితే ఇప్పుడు ఆ పుకార్లకు చెక్ పెడుతూ.. శర్వానంద్, రక్షితల పెళ్లికి ముహూర్తం ఖరారు చేసారు కుటుంబ సభ్యులు.
శర్వానంద్, రక్షితా ల వివాహం జూన్ 3 న రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరగనుంది. ఈ వివాహ వేడుక రెండు రోజులు పాటు వైభవంగా జరగనుంది. ఇక మెహందీ ఫంక్షన్ జూన్ 2 న జరుగుతుంది. మరుసటి రోజు పెళ్లి కొడుకు ఫంక్షన్ జరుగుతుంది. అదే రోజు జూన్ 3 న జైపూర్‌లోని లీలా ప్యాలెస్ లో శర్వానంద్, రక్షితా ల వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది. వివాహ వేడుక రాత్రి 11 నుండి ప్రారంభమవుతుందని తెలిపారు. ఇకపోతే ప్రీవెడ్డింగ్, వెడ్డింగ్ వేడుకలు అంగరంగవైభవంగా కన్నులపండగగా జరగనున్నాయి.