తన శ్రీమతి స్నేహారెడ్డికి ఊహించని కానుక ఇవ్వబోతున్నాడు అల్లు అర్జున్. తన అర్థాంగి కోసం హైదరాబాద్ నగర శివార్లలో ఓ ఖరీదైన ఫామ్‌హౌస్ కట్టించాడట బన్నీ. త్వరలోనే… ఆ ఫామ్ హౌస్ ని శ్రీమతికి ప్రజెంట్ చేయబోతున్నాడు. ”ఎప్పుడూ షూటింగ్.. షూటింగ్ అంటూ దేశాల్ని పట్టుకొని తిరుగుతుంటాం. అయితే ఇప్పుడ నాకు బాధ్యత పెరిగింది. స్నేహ.. కోసం, ముఖ్యంగా బాబు కోసం కొన్ని రోజులు కేటాయించాలనుకొంటున్నా. అందుకే ఎప్పటి నుంచో ఓ ఫామ్ హౌస్ నిర్మించాలన్న కోరిక ఉంది. అది ఇన్నాళ్లకి తీరింది. అక్కడ నేనూ, స్నేహా, బాబు ఆడుకొంటాం. ఇక నా వీక్ ఎండ్ పార్టీలు అక్కడే..” అంటున్నాడు బన్నీ. ఆ ఫామ్ హౌస్ తన అభిరుచులకు తగినట్టుగా బృందావనంలా తీర్చిదిద్దించుకొన్నాడట. త్వరలోనే అక్కడ తన తొలి పార్టీ చేసుకోబోతున్నాడు.