Glopixs : వినోద రంగంలో విప్లవాత్మక మార్పుల్ని తీసుకు వచ్చేందుకు కొత్త ఓటీటీ రాబోతోంది. బెంగళూరు బేస్డ్‌గా ఈ కొత్త ఓటీటీ సంస్థ ‘గ్లోపిక్స్’ కార్యకలాపాలు సాగించనుంది. ఈ కొత్త ఏడాది ప్రారంభంలోనే గ్లోపిక్స్ సంస్థ ఓ అడుగు ముందుకు వేసింది. గురువారం (జనవరి 2)న గ్లోపిక్స్ లోగోను అధికారికంగా ప్రారంభించారు. ఈ ఏడాది వేసవిలో పూర్తి స్థాయిలో ఈ ఓటీటీ సంస్థ అందుబాటులోకి రానుంది.
Game Changer : ఐమ్యాక్స్‌లో ఆడియెన్స్‌ను అలరించనున్న ‘గేమ్ చేంజర్’..
గ్లోపిక్స్‌ను విన్సే ఎల్ ఏ, అనిత సంయుక్తంగా స్థాపించగా.. లోకేష్ సన్నయ్య ఫౌండర్ మెంబర్/సిఎమ్ఓ ఫౌండింగ్ మెంబర్‌గా వ్యవహరిస్తున్నారు. మారుతి రాజీవ్ ఫౌండర్ మెంబర్/సిటిఓ, రూపేశ్ మామిళ్లపల్లి హైదరాబాద్ కంటెంట్ హెడ్‌గా వ్యవహరించనున్నారు. తాజాగా గ్లోపిక్స్ లోగోను సౌత్‌లో మూడు చోట్ల ఘనంగా లాంచ్ చేసారు. బెంగళూరు, కొచ్చి, హైదరాబాద్ వంటి ప్రదేశాల్లో ఈ లోగోను లాంచ్ చేసారు. ఇక ఈ ఫ్లాట్ ఫాంలో ఆసక్తికరమైన చిత్రాలు, వెబ్ సిరీస్‌లు, డాక్యుమెంటరీలు, రియాల్టీ షోలు అంటూ 360 డిగ్రీల ఎంటర్టైన్మెంట్‌ను అందించబోతున్నారు.