సెల్ఫీ కోసం విద్యా నవ్వులు చిందిస్తుండగా సదరు వ్యక్తి చేతితో వీపుపై కదుపులు స్టార్ట్ చేశాడట. ఆ తర్వాత మరోసారి చేయి వేసి హద్దులు మీరాడట. దాంతో ఆగ్రహించిన విద్యాబాలన్ ఆ వ్యక్తిని నీ హద్దులో నీవు ఉండు అని హెచ్చరించి అక్కడ ఉన్నవారి చేత చివాట్లు పెట్టించింది. తాజాగా మీడియాతో ముచ్చటించిన విద్యాబాలన్ తనపై ఆ వ్యక్తి ప్రవర్తించిన తీరును గుర్తుకు తెచ్చుకుని బాదపడ్డారు. మేము పబ్లిక్ వస్తువులం కాదు, సినీ పరిశ్రమలో పని చేసే వారంటే చాలా మంది చులకనగా చూస్తారు, కాని అందరికి మనోభావాలు ఉంటాయి అని సదరు వ్యక్తి తనపై జరిపిన లైంగిక వేధింపులను గుర్తు చేస్తూ ఆవేదన వ్యక్తం చేసింది.