బాలీవుడ్ హాట్ బ్యూటి విద్యాబాలన్‌పై గుర్తు తెలియని వ్యక్తి లైంగిక వేధింపులకు ప్పాడ్డాడు. విద్యాబాలన్ ‘భేగం జాన్’ చిత్ర నిర్మాత, దర్శకుడితో కోల్కత్తా ఎయిర్‌పోర్ట్‌లో ఉండగా ఒక వ్యక్తి వచ్చి సెల్ఫీ అని రిక్వెస్ట్ చేశాడట. సెల్ఫీనే అడిగాడు కాబట్టి విద్యాబాలన్‌కు ఒకే చెప్పిందట. ఆ తర్వాత భుజం మీద చేయివేసి సెల్ఫీ దిగే ప్రయత్నం చేయగా విద్యాబాలన్ చేయి తిని ఆగ్రహం వ్యక్తం చేసింది. అయినా కూడా సదరు వ్యక్తి చేయి తీయకపోవడంతో విద్యా బాలన్ మేనేజర్ వచ్చి ఆ వ్యక్తికి గట్టిగా చెప్పాడట. దాంతో ఆ వ్యక్తి చేయి తీసి సెల్ఫీ దిగే ప్రయత్నం చేస్తున్నాడట.
సెల్ఫీ కోసం విద్యా నవ్వులు చిందిస్తుండగా సదరు వ్యక్తి చేతితో వీపుపై కదుపులు స్టార్ట్ చేశాడట. ఆ తర్వాత మరోసారి చేయి వేసి హద్దులు మీరాడట. దాంతో ఆగ్రహించిన విద్యాబాలన్ ఆ వ్యక్తిని నీ హద్దులో నీవు ఉండు అని హెచ్చరించి అక్కడ ఉన్నవారి చేత చివాట్లు పెట్టించింది. తాజాగా మీడియాతో ముచ్చటించిన విద్యాబాలన్ తనపై ఆ వ్యక్తి ప్రవర్తించిన తీరును గుర్తుకు తెచ్చుకుని బాదపడ్డారు. మేము పబ్లిక్ వస్తువులం కాదు, సినీ పరిశ్రమలో పని చేసే వారంటే చాలా మంది చులకనగా చూస్తారు, కాని అందరికి మనోభావాలు ఉంటాయి అని సదరు వ్యక్తి తనపై జరిపిన లైంగిక వేధింపులను గుర్తు చేస్తూ ఆవేదన వ్యక్తం చేసింది.