‘అ..ఆ’ కు పాతికేళ్లు..

AA-Trailerటైటిల్ చూసి అదేంటి అనుకుంటున్నారా..అది మీము మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ చెబుతున్న మాట. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో నితిన్‌, సమంత జంటగా రూపుదిద్దుకుంటున్న ‘అ..ఆ’ అనసూయ రామలింగం వర్సెస్‌ ఆనంద్‌ విహారి’ శీర్షక. ఇప్పటి వరకు ఫస్ట్ లుక్ పోస్టర్ తో అలరించిన త్రివిక్రమ్ , ఈరోజు చిత్ర విడుదల చేసి అందరిని ఆసక్తి పరచాడు..

అ.. ఆ అంటే పక్క పక్కన ఉండే రెండు అక్షరాలే కాదు.. ఇద్దరు వ్యక్తులు. అంటూ సమంత చేత చెప్పించి..సినిమా ఫై మరింత ఆసక్తి పెంచాడు..ఈ చిత్రంలో అనసూయ రామలింగం పాత్రను పోషించిన సమంత, ఆనంద్‌ విహారిగా నటించిన నితిన్‌ని కలవడానికి పాతికేళ్లు పట్టిందట. ఈ టీజర్‌లో సమంత ఆలోచిస్తూ… రైలులో ప్రయాణిస్తూ కనిపించారు. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌. రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మే నెలలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..