‘అ..ఆ’ లో అదిరిపోయే పంచ్ డైలాగ్స్ ఇవే…

a-a-talk
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం లో నితిన్ , సమంత , అనుపమ జంటగా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘అ..ఆ ‘. మొదటి షో తోనే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రం, దానిలోని డైలాగ్స్ కూడా ఓ రేంజ్ లో రెస్పాన్స్ వస్తుంది..ముఖ్యంగా సమంత , నితిన్ లు చెప్పే డైలాగ్స్ కు ప్రేక్షకులు థియేటర్స్ లలో ఈలలు వేస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు..ఆ డైలాగ్స్ ఏంటో మీరే చూడండి..

డైలాగ్ 1 : ఏ చీర కట్టుకోవాలని అడిగావ్.. కట్టుకున్న వాడి గురించి మాత్రం ఒక్క మాట చెప్పలేదు.

డైలాగ్ 2 : అత్తారింటికి మా అమ్మాయి ఏడు వారాల నగలతో వెళుతుంది.. అదే మీ చెల్లెలు అయితే ఏడ్చుకుంటూ వెళుతుంది.

డైలాగ్ 3 : రావణాసురుడి మమ్మీ డాడీ కూడా శూర్పణఖను సమంతే అనుకుంటారు కదే… రావణాసురుడి పెళ్లాం కూడా వాళ్ల ఆయన్ను పవన్ కల్యాణే అనుకుంటుంది.

డైలాగ్ 4 : వాచ్ ఉన్న ప్రతివాడూ టైం వస్తుంది అనుకుంటాడు.. టైం తెలుస్తుందంతే..

డైలాగ్ 5 : రోడ్డు వైడెనింగ్లో సగం కొట్టేసిన బిల్డింగ్ లా అయిపోయింది నా బతుకు. ఉండటానికి పనికి రాదు, వదలటానికి మనసు రాదు

డైలాగ్ 6 : శత్రువులు ఎక్కడో ఉండర్రా..! ఇదిగో మన చుట్టూ ఇలా కూతుళ్లు, చెల్లెళ్ళ రూపంలో తిరుగుతూ ఉంటారు.