Site icon TeluguMirchi.com

‘మహేష్ ’ రికార్డు ను బ్రేక్ చేసిన ‘నితిన్ ‘..

nithin-breaks-mahesh-recordనితిన్ , త్రివిక్రమ్ కాంబినేషన్ లో గత గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న చిత్రం ‘అ..ఆ ‘. టాక్ పరంగానే కాక కలెక్షన్స్ పరంగా కూడా కొత్త రికార్డ్స్ ను బ్రేక్ చేస్తుంది..మొదటి 3 రోజులకు గానూ ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 20 కోట్లు షేర్ వసూలు చేసి నితిన్ కెరియర్ లోనే ఆల్ టైం బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది .

యుఎస్ లో మంచి పట్టు ఉన్న త్రివిక్రమ్ మరోసారి తన సత్తా ఏంటో ఈ చిత్రం తో చూపించాడు..మొదటి మూడు రోజులకు గానూ 1.39 మిలియన్ డాలర్లు వసూలు చేసిన ‘అ…ఆ…’ , మహేష్ బాబు ‘బ్రహ్మోత్సవం’ సినిమాను దాటేసింది. ఓవర్సీస్ లో ఫస్ట్ 3 డేస్ కలెక్షన్స్ ను పరిశీలిస్తే… ఇటీవల విడుదలైన ‘బ్రహ్మోత్సవం’ 7వ స్థానంలో 1.05 మిలియన్ డాలర్లతో నిలువగా, అ..ఆ చిత్రం 5వ స్థానంలో నిలిచింది.

ప్రస్తుత అ..ఆ కలెక్షన్స్ చూస్తే ఏకంగా 2 మిలియన్ మార్క్ ను క్రాస్ చేసి ‘శ్రీమంతుడు, నాన్నకు ప్రేమతో’ వంటి సినిమాల తర్వాత 2 మిలియన్ క్లబ్ లో చేరబోతోంది అని తెలుస్తుంది..చూద్దాం త్రివిక్రమ్ మాయాజాలం ఎంత వరకు నడుస్తుందో..

Exit mobile version