విజయ్ ని ఆకాశానికి ఎత్తిన హీరోయిన్


విజయ్‌ దేవరకొండ పై పొగడ్తల వర్షం కురిపించింది హీరోయిన్ అనన్యా పాండే. విజయ్ లాంటి వ్యక్తిని ఇప్పటి వరకు చూడలేదని చెప్పింది. పూరీ జగన్నాథ్‌ తెరకెక్కిస్తున్న సినిమాలో విజయ్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. అనన్యా పాండే కథానాయిక. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన 40 రోజుల షూటింగ్‌ ముంబయిలో జరిగింది.

కాగా ఇందులో విజయ్‌తో కలిసి నటించడం గురించి అనన్య తన అభిప్రాయం పంచుకుంది. ” విజయ్‌ పెద్ద స్టార్‌ అయినప్పటికీ చాలా వినయంగా ఉంటారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం ఆయనది. అంతేకాదు చాలా దయ ఉన్న వ్యక్తి. సున్నితంగా మాట్లాడుతారు’ అని కితాబిచ్చింది