ఓటీటీలో ఆస్కార్స్ లైవ్ స్ట్రీమింగ్..


సినీరంగంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డ్ వేడుకలు అమెరికాలో జరగబోతున్న సంగతి తెలిసిందే. ప్రతి ఏటా సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిభ కనబరిచిన నటీనటులకు, సినిమాలకు ఈ అవార్డ్ ప్రదానం చేస్తారు. మరికొన్ని రోజుల్లో ఈ అవార్డుల వేడుక వచ్చేస్తోంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా సంబరాలు మొదలైయ్యాయి. కాగా ఈసారి అస్కార్ అవార్డులు తెలుగువారికి మరీ స్పెషల్. అందుకు కారణం ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ బరిలో నిలవడమే. అదీ కాక మన తెలుగు పాటను(నాటు నాటు) లైవ్ లో ఆడి, పాడుతున్నారు కూడా. ఇక ఇప్పటికే మన టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి దర్శకధీరుడు రాజమౌళి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అమెరికా పర్యటనలో ఉండగా.. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైతం అమెరికాకు చేరుకున్నారు.

అయితే ఈ వేడుకను ప్రత్యక్షంగా చూడటానికి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణంలో.. ప్రముఖ ఓటీటీ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. ఆస్కార్ అవార్డు వేడుకలను లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నట్లు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సోమవారం ట్విటర్ ద్వారా అనౌన్స్ చేసింది. ఇక ఈ ఈవెంట్ ఇండియాలో సోమవారం, మార్చి 13 ఉదయం 5.30 గంటల నుంచి లైవ్ స్ట్రీమ్ కానుంది.

ఇకపోతే టాలీవుడ్ నుంచి ఆర్ఆర్ఆర్ మూవీలో నాటునాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నామినేట్ అయింది. దీనికి ఆస్కార్ రావడం ఖాయమనే అంటున్నారు. ఈసారి ఆస్కార్ అవార్డుల్లో భారతీయులకు మరో అట్రాక్షన్ దీపికా పడుకొనె అవార్డు ప్రజెంటర్లలో ఒకరుగా వ్యవహరించడం కూడా. ఈ అవకాశం దక్కించుకున్న తొలి భారతీయ నటి దీపికానే కావడం విశేషం.

రొమాంటిక్ గా ‘వెన్నెల్లో ఆడపిల్ల’..