Site icon TeluguMirchi.com

‘7:11 PM’ ట్రైలర్ చూస్తుంటే భారీ సినిమాలకి వున్న VFX కనిపించాయి : హరీష్ శంకర్


సైన్స్ ఫిక్షన్ జోనర్ చిత్రాలకు హై బడ్జెట్ అవసరం. అయితే సాహస్, దీపిక నటించిన ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ ‘7:11 PM’ నిర్మాతలు కథ, భారీ-స్థాయి మేకింగ్, అత్యుత్తమ సాంకేతిక ప్రమాణాలతో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ చిత్రం పరిమిత బడ్జెట్, వనరులతో రూపొందించబడినప్పటికీ అవుట్ పుట్ మాత్రం అంతర్జాతీయ ప్రాజెక్ట్ కి సరి సమానంగా వుంది. ఈ సినిమా టీజర్‌కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ప్రముఖ ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ హౌస్ మైత్రి ద్వారా జూలై 7న 7:11 PM భారీగా విడుదల కానుంది. ఈ క్రమంలో తాజాగా ఈరోజు సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ లాంచ్ చేశారు.

ఇకపోతే కథ మూడు వేర్వేరు కాలాలు, రెండు వేర్వేరు గ్రహాలలో జరుగుతుంది. ఒక ఫ్లయింగ్ సాసర్ ఒక మిషన్‌లో భూమిలోకి ఎంటర్ అవుతుండగా, ఇండియాలోని హంసలదీవి అనే చిన్న పట్టణంలో బస్సు ఎక్కిన వ్యక్తి, మరుసటి రోజు మెల్‌బోర్న్‌లోని బీచ్‌లో అపస్మారక స్థితిలో ఉంటాడు. కేవలం పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ లో ఒక రోజులో అంత దూరం ఎలా ప్రయాణించాడో.. ఏమి జరిగిందో అతనికి తెలియదు. ‘7:11 PM’ ఆలోచన, కథ చాలా వినూత్నంగా ఉంది. రచన, తీసిన విధానం ఎక్స్ టార్డినరిగా వుంది. VFX కోసం వెచ్చించే ప్రతి పైసా ఒక్కో ఫ్రేమ్‌లో స్పష్టంగా కనిపిస్తుంది. ప్రధాన నటీనటులు నటన, నిర్మాణ, సాంకేతిక విలువలు అద్భుతంగా వున్నాయి. ఆర్కస్ ఫిలింస్ బ్యానర్‌పై నరేన్ యనమదల, మాధురి రావిపాటి, వాణి కన్నెగంటి నిర్మించిన ఈ చిత్రానికి చైతు మాదాల దర్శకత్వం వహిస్తున్నారు.

7:11 PM Trailer Telugu | Saahas Pagadala | Deepika Reddy | Tess Walsh | Chaitu Madala | Arcus Films

ఈ సందర్భంగా డైరెక్టర్ హరీష్ శంకర్ మాట్లాడుతూ.. 7:11 PM ట్రైలర్ చూస్తుంటే భారీ సినిమాలకి వున్న వీఎఫ్ఎక్స్ కనిపించాయి. చాలా ఇంట్రస్టింగా వుంది. సినిమాని చాలా ప్యాషన్ తో నిర్మించిన టీం కి అందరికీ నా అభినందనలు. టైం ట్రావెల్ కాన్సెప్ట్ చాలా ఆసక్తికరంగా వుంది. సౌండ్, విజువల్స్ చాలా బావున్నాయి. 7:11 PM జులై 7న వస్తోంది. అందరూ థియేటర్ లో తప్పకుండా చూడండి అన్నారు.

Exit mobile version