రికార్డులను షేక్ చేసిన గబ్బర్ సింగ్ – ఇప్పుడు అవార్డులు అందుకోవడంలో కూడా తన జోరు చూపిస్తున్నాడు. మొన్న మా టీవీ అవార్డుల్లో గబ్బర్ సింగ్‌దే హవా. ఇప్పుడు సైమాలోనూ అతనిదే సందడి. సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్ లో గబ్బర్ సింగ్ చెలరేగిపోయాడు. ఏకంగా ఆరు అవార్డులను కైవసం చేసుకొందీ చిత్రం. ఉత్తమ నటుడిగా పవన్ కల్యాణ్ ఎంపికయ్యాడు. ఉత్తమ కథానాయిక పురస్కారం శ్రుతిహాసన్ ఎగరేసుకుపోయింది. ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ దర్శకుడు విభాగాలలో కూడా గబ్బర్ సింగ్ కే అవార్డులు దక్కాయి. ఈ రికార్డుల చిత్రానికి ఇంకెన్ని అవార్డులు దక్కుతాయో చూడాలి.