గత వారం తుఫాన్ తాకిడికి చిన్న సినిమాలు విలవిలలాడాయి. థియేటర్లన్నీ తుఫాన్ కైవసం చేసుకొంటే… ఇక చిన్న సినిమాలకు చోటెక్కడ. అందుకే చిన్నవేవీ బాక్సాఫీసు ముందుకు రాలేదు. ఈవారం మాత్రం కట్టకట్టుకొని బాక్సాఫీసు దగ్గర దండయాత్ర చేయబోతున్నాయి. ఏకంగా 5 సినిమాలు వినోదాన్ని పంచడానికి సిద్ధమయ్యాయి. పోటుగాడు, కమీనా, నీడ, నాసామి రంగ, కిస్… ఇవన్నీ థియేటర్లను కళకళలాడించడానికి క్యూ కడుతున్నాయి. మంచు మనోజ్ నటించిన పోటుగాడు సెంట్రాఫ్ ఎట్రాక్షన్ కానుంది. ఈ సినిమా ప్రారంభ వసూళ్లు దండుకొనే అవకాశాలున్నాయి. బాక్సఫీసు దగ్గర పెద్ద సినిమాలీ లేకపోవడం, తుఫాన్ ఫ్లాపుల లిస్టులో చేరిపోవడంతో పోటుగాడు తన ప్రతాపం చూపించనున్నాడు. థ్రిల్లర్ తరహా చిత్రం కమీనా ప్రచార చిత్రాలు కూడా ఆకట్టుకొంటున్నాయి. ఇక మిగిలిన సినిమాలపై ఎవరికీ నమ్మకాల్లేవు. కానీ.. ఏ సినిమాలో ఏముందో ఎవరు చెప్పగలరు..? ప్రేక్షకుడు తప్ప.