Site icon TeluguMirchi.com

34 ఏళ్ల తరువాత మహేష్ ముఖ్య మంత్రియ్యాడు..

టైటిల్ చూసి ఏంటి అనుకుంటున్నారా..సూపర్ స్టార్ మహేష్ బాబు – కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిన భరత్ అనే నేను చిత్రం భారీ అంచనాల మధ్య మరికొద్ది సేపట్లో విడుదల కాబోతుంది. ఈ మూవీ లో మహేష్ ముఖ్య మంత్రి పాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే.

‘భరత్ అనే నేను’.. శాసనం ద్వారా నిర్మితమైన.. భారత రాజ్యాంగం పట్ల.. నిజమైన విశ్వాసం.. విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడతానని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతః కరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయంగానీ, పక్షపాతం గానీ, రాగ ద్వేషాలు గానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను’ అంటూ ట్రైలర్ లో చెప్పి యావత్ సినీ , రాజకీయ నాయుకులు తనవైపు తిప్పుకున్నాడు.

ఇదే మాట 34 ఏళ్ల క్రితం సూపర్ స్టార్ చెప్పిన సంఘటనను ప్రేక్షకులు గుర్తి చేసుకుంటూ , అప్పటి చిత్ర పోస్టర్ ను సోషల్ మీడియా లో షేర్ చేస్తున్నారు. సూపర్ స్టార్ కృష్ణ హీరోగా ‘ముఖ్యమంత్రి’ అనే మూవీ విడుదలయింది. విజయ నిర్మల దర్శకత్వం వహించింది. ఈ చిత్రం విడుదలైన తొలి వారంలోనే రూ. 52,13,169 వసూలు చేసి రికార్డు కలెక్షన్లతో సంచలన విజయాన్ని నమోదు చేసింది. సరిగ్గా 34 ఏళ్ల తరువాత ‘భరత్ అనే నేను’ చిత్రంలో మహేష్ ముఖ్యమంత్రిగా నటిస్తుండటం ఈ రెండు చిత్రాల పోస్టర్లు అభిమానుల్ని బాగా ఆకట్టుకుంటూ , 34 ఏళ్ల రికార్డు ని మళ్లీ భరత్ తిరగరస్త్తాడని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version