చిరంజీవి నటించబోతున్న 152వ చిత్రంలో చిన్న పాత్ర అయినా పెద్ద పాత్ర అయినా కమెడియన్ అయినా మరే పాత్ర అయినా ఇవ్వాలంటూ స్టేజ్ మీద కొరటాల శివతో రికెస్ట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క నటుడు చిరంజీవి గారి సినిమాలో నటించాలని కోరుకుంటాడు. అందరిలాగే నేను కూడా చిరంజీవి గారితో నటించేందుకు ఇష్టపడతాను. ఆయన చేస్తున్న ప్రతి సినిమాలో ఉండాలని కోరుకుంటాను అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఎస్వీబీసీ ఛానెల్ చైర్మన్ అయినా కూడా సినిమాల్లో కామెడీ పాత్రలు చేసేందుకు పృథ్వీ ఒప్పుకోవడం ఆహ్వానించదగ్గ పరిణామం. సినిమాల్లో సాదారణంగానే నటిస్తానంటూ చెప్పిన పృథ్వీ తానేం మెగా హీరోలకు వ్యతిరేకం కాదని, భవిష్యత్తులో వారి సినిమాల్లో ఛాన్స్ ఉంటే తప్పకుండా నటిస్తానంటూ చెప్పుకొచ్చాడు.