36ఏళ్ల బాలీవుడ్ స్టార్ ప్రియాంకా చోప్రా తన కాబోయే భర్త నిక్ జోనస్ ఆదివారం నాడు తన 26వ పుట్టిన రోజు జరుపుకున్నాడు. లాస్ ఏంజిల్స్‌లోని బేస్‌బాల్ స్టేడియంలో జరిగిన ఆ బర్త్‌డే ఈవెంట్‌కు ప్రియాంకా కూడా హాజరైంది. బర్త్‌డే కేక్ కోసిన తర్వాత నిక్ జోనస్ అందర్నీ కలిశాడు. అయితే స్టేజ్ మీదున్న ప్రియాంకా కూడా తన బాయ్‌ఫ్రెండ్ నిక్ పెదవులపై ప్రియాంకా లిప్ కిస్ ఇచ్చి బర్త్‌డే విషెస్ చెప్పింది.
అయితే ప్రియాంకా చోప్రా కాబోయే భర్త నిక్ జోనస్‌కు పబ్లిక్‌గానే కిస్ ఇవ్వడాన్ని తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఇటీవల ముంబైలో ప్రియాంకా నిక్‌లు రోకా సెర్మనీ జరుపుకున్నారు. ఆ టైమ్‌లో రెండు ఫ్యామిలీలు చాలా క్లోజ్ అయ్యాయి. వచ్చే ఏడాది అమెరికాలోనే నిక్‌ను పెళ్లి చేసుకోనున్నట్లు ప్రియాంకా ఈమధ్యే వెల్లడించింది.