సంక్రాంతి అంత దిల్ రాజుదే..

టాలీవుడ్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ కామ్ డిస్ట్రిబ్యూటర్ అంటే దిల్ రాజు పేరే చెపుతారు. డిస్ట్రిబ్యూటర్ గా అప్పుడప్పుడు పెద్ద ఎదురు దెబ్బలే తిన్న…నిర్మాత గా మాత్రం సక్సెస్ లు అందుకుంటుంటారు. ఈ ఏడాది మొదట్లో ఎఫ్ 2 తో భారీ విజయమే అందుకున్న ఈయన..వచ్చే సంక్రాంతి రిలీజ్ అవుతున్న చిత్రాలన్నిటికి ఈయన నిర్మాత కామ్ డిస్ట్రిబ్యూటర్.

మహేష్ బాబు – అనిల్ కలయికలో తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరు సినిమాలో దిల్ రాజు భాగస్వామి. నైజాం, వైజాగ్ డిస్ట్రిబ్యూటర్. కృష్ణా లాంటి మరికొన్ని ఏరియాలు కూడా తీసుకోవొచ్చేమో అని అంటున్నారు. అలాగే బన్నీ-త్రివిక్రమ్ కాంబినేషన్ లో రాబోతున్న అల వైకుంఠపురములో సినిమాకు నైజాం డిస్ట్రిబ్యూటర్. వైజాగ్ వ్యవహారం డిస్కషన్లలో వుంది. రజనీకాంత్ దర్బార్ సినిమాను తెలుగు రాష్ట్రాల హక్కులు తీసుకున్న ముగ్గురిలో దిల్ రాజు ఒకరు. ఇక మిగిలిన సినిమా కళ్యాణ్ రామ్ ఎంత మంచివాడవురా? ఈ సినిమా కూడా నైజాం, వైజాగ్ దిల్ రాజే చేయడానికి అవకాశం వుంది. ఇలా సంక్రాంతి సినిమాలంటికి రాజు గారు వెనుకన్నారు. సో ఈ చిత్రాలన్నీ ఎంత వసూళ్లు చేసిన రాజు గారికే..