Site icon TeluguMirchi.com

ఆ హీరోయిన్ అతడికి రెండో పెళ్లామట…

చిత్రసీమలో పెళ్లిళ్లు చేసుకోవడం..వెంటనే విడాకులు ఇవ్వడం..ఆ తర్వాత రెండో పెళ్లి చేసుకోవడం కామన్. తాజాగా 10th క్లాస్ హీరోయిన్ కూడా ఓ హీరోకు రెండో భార్య అవ్వడానికి సిద్ధపడుతుంది . తెలుగు లో 10th క్లాస్ మూవీ తో పరిచమైన సునైన..మొదటి సినిమా పెద్దగా ఆకట్టుకోకపోయేసరికి అమ్మడికి అవకాశాలు రాకుండా పోయాయి. దీంతో తమిళ్ ఫై ఫోకస్ పెట్టి అక్కడ అవకాశాలు రాబట్టుకుంది. కాకపోతే పెద్ద హీరోయిన్ అవ్వలేకపోయింది. ఈ నేపథ్యంలో హీరో కులశేకరన్ తో ప్రేమలో పడింది. కులశేకరన్ కు అప్పటికే పెళ్లయింది. కాకపోతే ఆమెకు విడాకులు ఇచ్చాడు.

సునైన – కులశేకరన్ ప్రేమ వ్యవహారం సునైన కుటుంబ సబ్యులకు నచ్చలేదు. అతడికి ఇదివరకే పెళ్లి కావడంతో ఆమె కుటుంబసభ్యులు అభ్యంతరం వ్యక్తంచేశారు. కానీ సునైనా వారికీ నచ్చజెప్పి పెళ్లి సిద్ధమైంది. వాస్తవానికి ఏప్రిల్ నెలలో పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు కానీ లాక్ డౌన్ కారణంగా వాయిదా వేసుకున్నట్లు తమిళ్ మీడియా లో వార్తలు వినిపిస్తున్నాయి.

Exit mobile version