Site icon TeluguMirchi.com

బాలీవుడ్ బిలియన్ భామలు !

biliyan bhalauఅందం, అభినయం రెండింటి కలబోతే వెండితెర పై కథానాయిక. సినిమా పరిశ్రమలో హీరో తరువాత స్థానం హీరోయిన్ దే అని చెప్పాలి. హీరో తరువాత హీరోయిన్ కే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. అందుకే ఇండియన్ స్క్రీన్ మీద హీరో పక్కన హీరోయిన్ లేకుండా సగటు సిని ప్రేక్షకుడు ఊహించుకోలేడు. హీరోయిన్స్ కెరీర్ మహా అయితే పదేళ్ల ఉంటుంది. అయితేంటి ఉన్నంతలో వారి ప్రతిభను నిరూపించుకునే కథానాయకలున్నారు. బాలీవుడ్ లో విజయాలతో దూసుకుపోతున్నాబిలియన్ హీరోయిన్స్ పై తెలుగు మిర్చి ఓ స్పెషల్ ఫోకస్..

ప్రస్తుతం బాలీవుడ్ లో హిట్టు అనే అర్ధానికి నిర్వచనం మారిపోయింది. వంద కో్ట్లు సాధిస్తేనే అక్కడ సూపర్ హిట్టు కింద లెక్కన్నమాట. అయితే ఈ వంద కోట్ల సినిమాలో హీరోయిన్స్ కూడా వాటా దక్కించుకుని వారి క్రేజ్ ని ఆమాంత పెంచేసుకుంటున్నారు. 2008 తరువాత బాలీవుడు పెద్ద హీరోల సినిమాలు వందో కోట్లు దాటితే ఆ హీరోలకు క్రేజ్ ఉందనే విదంగా మారింది. అయితే ఈ బిలియన్ క్లబ్ లో మొదట ఖాత తెరిచింది అమిర్ ఖాన్. అది ఓ దక్షణాది సినిమా కావడం విశేషం అందులో హీరోయిన్ కూడా దక్షణాదికి చెందింది కావడం మరో విశేషం. బాలీవుడు హిట్టు ఫార్ములాను మిస్టర్ పర్ ఫెక్ట్ అమిర్ ఖాన్ మార్చేశాడు. గజిని సినిమా తో అమిర్ వంద కోట్లు కలెక్షన్స్ వసూల్ చేసి బాలీవుడ్ ను ఆశ్చర్యపోయేలా చేయడమే కాకుండా బాలీవుడ్లో సినిమా హిట్టు అంటే వంద కోట్లు అనేలా చేశాడు. వంద కోట్ల మొదటి హీరోయిన్ దక్షణాదికి చెందిన హీరోయిన్ కావడం విశేషం. అసిన్ గజిని తో బిలియన్ భామగా మారింది.

2008 తరువాత నాలుగు సినిమాలు మాత్రమే వంద కోట్ల క్లబ్ లో చేరాయి. అయితే ఆ సంఖ్య ప్రస్తుతం 22 చేరింది. బాలీవుడ్లో అసిన్ తరువాత బిలియన్ భామలుగా కరీనా కపూర్, సోనాక్షి సిహ్హ, కత్రినా కైఫ్. ప్రియాంక చోప్రా, దీపిక పదుకొనే, కాజల్, సోనామ్ కపూర్ బిలియన్ భామలు గా అవతారించారు.

ప్రస్తుతం బాలీవుడ్లో సుమార్ పదేళ్లకు పైగా క్రేజీ హీరోయిన్ గా కొనసాగుతున్న భామ కరీనా కపూర్. లేట్ గా ఫామ్ లోకి వచ్చిన బెబో బిలియన్ క్లబ్ లో మాత్రం యమ పాస్ట్ గానే ఉంది. మళీయళం రిమేక్ గా హిందిలొ తెరెకెక్కిన కండల వీరుడు సినిమా బాడీ గార్డు సినిమాతో కరీనా కపూర్ బిలియన్ బేబీగా మారింది. ఈ సినిమా సుమార్ 155 కోట్లు సంపాదించి ఆ సంవత్సరం టాప్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది.

బాడీగార్డు తరువాత మరో మూడు బిలియన్ సినిమాలను తన ఖాతలో వేసుకుంది ఈ బాలీవుడ్ కలల రాణి. షారుక్ ఖాన్ హీరోగా వచ్చిన ‘రా వన్’ సినిమా 114 కోట్లు, గోల్ మాల్ 108 కోట్లు, కలెక్ట్ చేశాయి. అయితే అమిర్ ఖాన్ హీరోగా వచ్చిన ‘త్రీ ఇడియట్స్,’ 200 కోట్లు సంపాదించి న్యూ రికార్డు ను నెలకొల్పింది. దీంతో కరీనా టూ బిలియన్స్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.

హీరోయిన్ గా కరీనా కపూర్ అంత క్రేజ్ లేకపోయిన బిలియన్ హీరోయిన్ గా కరీనా కు ఏ మాత్రం తీసిపోని విధంగా వంద కోట్ల సినిమాల్లో నటిస్తుంది. కేరళ కుట్టి అసిన్. నాలుగు వంద కోట్ల సినిమాను చేసి బాలీవుడ్ హీరోయిన్స్ కి సవాల్ విసురుతుంది అసిన్.

తెలుగు, తమిళ సినిమాల్లో హీరోయిన్ గా టాప్ పొజిషియన్ లో ఉన్నప్పుడే కోలీవుడ్ టాలీవుడ్ లకు గుడ్ బాయ్ చెప్పి ముంబాయి చెక్కెసింది. మళయాళ మారుతం. బాలీవుడ్లో చేసిన మొదటి సినిమా గజిని తో నే వంద కోట్లు ఖాతాను తెరిచింది అసిన్. 2008 లోనే గజిని సినిమా సుమార్ 115 కోట్ల కలెక్ట్ చేసి బిలియన్ సినిమాల ఖాను తెరిచింది. దీంతో బాలీవుడులో అసిన్ పేరు ఒక్కసారిగా మోతమోగింది. గజిని సక్సెస్ తో ఈ భామకు బాలీవుడ్ లో మంచి అవకాశాలే వచ్చాయి.

గజిని సినిమా తెచ్చిన క్రేజ్ తో అసిన్ కి బాలీవుడ్ లో భారీ అవకాశాలే వచ్చాయి. దీంతో ఈ కుట్టి అకౌంట్ లో మరో మూడు వందకోట్ల సినిమాలు చేరాయి. సల్మాన్ ఖాన్ హీరోగా హిందిలో తెరకెక్కిన తెలుగు ‘రెఢీ’ బాలీవుడ్ లో కూడా ‘రెఢీ’గా నే విడుదలై సూపర్ హిట్టు అయింది. ఈ సినిమా 130 కోట్లు వసూల్ చేసింది. దీని తో పాటు హౌస్ పుల్ 2, 112 కోట్లు, బోల్ బచ్చన్ 104 కోట్ల వసూల్ చేశాయి. దీంతో బిలియన్ హీరోయిన్స్ లిస్ట్ లో అసిన్ కూడా టాప్ ప్లేస్ లో ఉంది.

హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సినిమానే బిలియన్ క్లబ్ లో చేరింది. అంతేకాదు సినియర్ హీరోయిన్స్ ని కాదని ప్రస్తుతం బాలీవుడ్ లో హిట్టు మీద హిట్టు కొడుతూ జెట్ స్పీడ్ తో టాప్ వన్ ప్లేస్ లోకి దూసుకుపోతుంది సోనాక్షి సిహ్హ. ఇంత వరకు సొనాక్షి చేసిన సినిమాలన్ని సూపర్ హిట్సే. బాలీవుడ్లో సినియర్ హీరోయిన్స్ కి కూడా సాధ్యం కాని వాటిని కేవలం 21 ఏళ్ల సోనాక్షి సిహ్హ చేసి చూపించింది. సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన ‘దబాంగ్’ సినిమాతో హీరోయిన్ గా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బొద్దు గుమ్మ మొదటి సినిమాతోనే బిలియన్ హీరోయిన్ గా రికార్డు సృష్టించింది. శత్రజ్ఙసిహ్హ వారసురాలిగా అడుగు పెట్టిన సొనాక్షి తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్ గా క్రేజ్ ను సంపాందించుకుంది.

సొనాక్షి మొదటి సినిమా దబాంగ్ సూపర్ డూపర్ హిట్టు కావడంతో పాటు 150 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో టాప్ హీరోలు ఈ బొద్దు అందాన్ని తమ సినిమాలో పెట్టుకోవడానికి ఎగిరి గంతేశారు. తెలుగులో వచ్చిన విక్రమార్కుడు సినిమా హింది రిమేక్ అక్షయ్ కుమార్ హీరోగా నటించగా సొనాక్షి సిహ్హ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా కూడా 133 కోట్లు కొల్లగొట్టింది. వీటితో పాటు ‘సన్నాఫ్ సర్థార్’, ‘మర్యాద రామన్నా’ రీమేక్ 106 కోట్లు, ‘దబాంగ్’ 2 178 కోట్లు సంపాదించాయి. దీంతో సొనాక్షి సిహ్హను బాలీవుడు దర్శక నిర్మాతలు గొల్డెన్ లెగ్ అని బిలియన్ భామ అని తెగ పొగుడుతున్నారు. ప్రస్తుతం బాలీవుడ్లో సూపర్ క్రేజ్ ఉన్న హీరోయిన్ గా సొనాక్షి నీరాజనాలు అందుకుంటుంది.

బిలియన్ భామ గా, నటిగా క్రేజ్ ను తెచ్చుకుంటున్న మరో సెక్సీ బ్యూటీ ప్రియాంక చోప్రా. కెరీర్ బిగినింగ్ నుంచి గ్లామర్ తో పాటు నటనకు స్కోప్ ఉన్న సినిమాల్లో నటిస్తూ బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లో ఒకరిగా కొనసాగుతుంది ప్రియాంక చోప్రా.

ప్రియాంక చోప్రా కెరీర్ పరంగా సోనాక్షి కంటే సినియన్ అయినప్పటికి వంద కోట్ల సినిమాల విషయం లో మాత్రం జూనియర్ కంటే కాస్త వెనుకపడిందని చెప్పాలి. చాలా హిట్టు సినిమాల్లో నటించిన ప్రియాంక చోప్రా కు మాత్రం మొదటి బిలియన్ సినిమా షారుక్ ఖాన్ హీరోగా వచ్చిన డాన్ 2 రూపంలో దక్కింది. ఈ సినిమా 114 కోట్లు సంపాందించి అటు షారుక్ కి ఇటు ప్రియాంక కి బిలియన్ క్లబ్ అకౌంట్ ని తెరిచింది.

డాన్ సినిమా తరువాత ఈ బాలీవుడు బ్యూటీ మరో రెండు బిలియన్ సినిమాల చేసి తను కూడా బిలియన్ రేస్ లో టాప్ పొజిషియన్ లో ఉన్నానని సిగ్నల్ ఇచ్చింది. హృతిక్ రోషన్ హీరోగా వచ్చిన ‘అగ్నిపథ్’ సినిమా122 కలెక్ట్ చేయడంతో రెండో బిలియన్ హిట్టు అందుకుంది ఈ సుందరి. అయితే రణబీర్ కపూర్ హీరోగా వచ్చిన బర్ఫీ సినిమాతో ప్రియాంక చోప్రా అటు బిలియన్ ఇటు తో పాటు విమర్శకుల ప్రశంశలు అందుకుంది. ఈ సినిమా 122 కోట్లు సంపాందించింది.

బిలియన్ క్లబ్ లో పోటిపడుతున్న మరో హాట్ బ్యూటీ బెంగుళూర్ భామ దీపిక పదుకొనే. మొదట దక్షణాది సినిమాల్లో అదృష్టం పరీక్షించుకున్న ఈ భామకు ఇక్కడి కంటే బాలీవుడులోనే బాగా కలిసొచ్చింది. వరుస ఛాన్స్ లతో పాటు హిట్స్ ను కూడా తన ఖాతలో వేసుకుంటుంది. బాలీవుడ్ సుందరాంగులకు ఏ మాత్రం తీసిపోని ఫిగర్ తో ఉండే దీపిక హిట్లు ను కూడా అదే రేంజ్ లో అందిస్తూ క్రేజ్ హీరోయిన్ గా మారింది. షారుక్ ‘ఓం శాంతి ఓం’ సినిమాతో బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈ పొడుగు సుందరి ‘రేస్ సినిమాతో తొలిసారి వందకోట్ల హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.

రేస్ 2 సినిమా 115 కోట్లు వసూల్ చేయడంతో బిలియన్ క్లబ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న దీపికయే జవానీ హై దివానీ’ సినిమాతో మరో బిలియన్ హిట్టు అందుకుంది. ఈ సినిమా కొంచెం తేడాతో 200 కోట్లను మిస్ అయింది. 189 కోట్లును కొల్లగొట్టింది. హై జవానీ సినిమా. ఈ మధ్య షారుక్ దీపిక కాంబినేషన్ వచ్చి సెన్సెషన్ క్రియేషటి చేస్తున్న ‘చెన్నై ఎక్సప్రెస్’ సినిమా ఏకంగా బాలీవుడ్ లో ఇప్పటి వరకు ఉన్న ‘త్రీ ఇడియట్స్’ కలెక్షన్స్ ని కూడా బద్దలకొట్టింది. ఈ సినిమా ఇప్పటి వరకు సుమార్ 220 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో ఈ హాట్ బ్యూటీ పుల్ జోష్ మీద ఉంది.

హాలీవుడ్ అందాన్ని తనలో నింపుకున్న బాలీవుడ్  హీరోయిన్ కత్రినా కైఫ్. ఈ సెక్సీ హీరోయిన్ బిలియన్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది. గ్లామర్ పరంగా కేవ్వుకేక అయినప్పటికి బిలియన్ క్లబ్ లో మిగతా హీరోయిన్ల కంటే కాస్త వెనుకపడింది. కత్రినా కైఫ్ తన మాజీ ప్రియుడు సల్మాన్ తో చేసిన ఏక్ థా టైగర్ సినిమాతో బిలియన్ క్లబ్ లో చేరింది. ఈ సినిమా 198 కోట్లు వసూల్ చేసింది. ఈ సినిమా తరువాత మరోసారి కత్రినాకు జాబ్ తక్ హై జాన్ సినిమాతో మరో బిలియన్ సినిమా తన అకౌంట్ లో చేరింది.ఈ సినిమా 123 కోట్లు కలెక్ట్ చేసింది.

వీరితో పాటు ఎంతో కాలంగా సూపర్ హిట్టు కోసం ఎదురుచూస్తున్న సోనామ్ కపూర్ కి ఈ ఎడాది మరుపురాని సంవత్సరం గా మిగులుతుంది. ఆమె నటించిన ‘రంజాన’ సినిమా కొద్ది తేడా తో బిలియన్ క్లబ్ లో చోటు కొల్పోగా, ‘బాగ్ మిల్కా భాగ్’ సినిమాతో సోనామ్ కల నేరవేరింది. ఈ సినిమా 104 కోట్లు వసూల్ చేసి సోనామ్ ని బిలియన్ హీరోయిన్ ని చేసింది. సోనామ్ తో పాటు తెలుగు హీరోయిన్ కాజల్ కూడా సింగంతో బిలియన్ హీరోయిన్ గా పేరుతెచ్చుకుంది.

ఇలా ఈ ముద్దు గుమ్మలు తమ వంతు పాత్ర పోషిస్తూ సినిమా వందకోట్ల మార్కును దాటడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. మరి ముందు ముందు బాలీవుడ్ లో ఇంకెంత మంది బిలియన్ భామలు తెరపై సందడి చేస్తారో చూడాలి.

Exit mobile version