Site icon TeluguMirchi.com

వావ్… ‘వన్’

maheshసూపర్ స్టార్ మహేష్ ఫాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా ‘1 నేనొక్కడినే’  ట్రెయిలర్‌ న్యూ ఇయర్ కానుక రిలీజ్ చేశారు. 58 సెకన్ల నిడివి గల ట్రెయిలర్‌ చూస్తుంటే  హాలీవుడ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ట్రెయిలర్‌ని చూస్తున్న ఫీల్ వచ్చింది. ఈ చిత్రం కోసం వన్ టీం దాదాపు రెండు సంవత్సరాల పాటు పనిచేశారు. నిర్మాతలు కూడా ఖర్చు విషయంలో ఎక్కడా  రాజీపడలేదట. ట్రెయిలర్‌ చూస్తుంటే అర్ధం అవుతుంది. ఈ చిత్రం యాక్షన్‌ థ్రిల్లర్‌  అని విజువల్స్‌ లో తెలుస్తోంది. ట్రెయిలర్‌ లో మహేష్ చెప్పే ఓ డైలాగ్ వినిపించింది. ‘నాకు కావాల్సింది నాకు తెలిసిన కధ కాదు తెలీని కధ’. అదిరిపోయింది. ట్రెయిలర్‌ లో చేజింగ్ లు అదుర్స్ అనిపించాయి. ఇక దేవి శ్రీ  హై స్టాండర్డ్ స్కోర్ ఇచ్చాడు.

న్యూ ఇయర్ గిఫ్ట్ గా వచ్చిన ఈ ట్రెయిలర్‌ను మీరు ఓ లుక్కేసుకోండి.

Exit mobile version