సూపర్ స్టార్ మహేష్ ఫాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా ‘1 నేనొక్కడినే’ ట్రెయిలర్ న్యూ ఇయర్ కానుక రిలీజ్ చేశారు. 58 సెకన్ల నిడివి గల ట్రెయిలర్ చూస్తుంటే హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ ట్రెయిలర్ని చూస్తున్న ఫీల్ వచ్చింది. ఈ చిత్రం కోసం వన్ టీం దాదాపు రెండు సంవత్సరాల పాటు పనిచేశారు. నిర్మాతలు కూడా ఖర్చు విషయంలో ఎక్కడా రాజీపడలేదట. ట్రెయిలర్ చూస్తుంటే అర్ధం అవుతుంది. ఈ చిత్రం యాక్షన్ థ్రిల్లర్ అని విజువల్స్ లో తెలుస్తోంది. ట్రెయిలర్ లో మహేష్ చెప్పే ఓ డైలాగ్ వినిపించింది. ‘నాకు కావాల్సింది నాకు తెలిసిన కధ కాదు తెలీని కధ’. అదిరిపోయింది. ట్రెయిలర్ లో చేజింగ్ లు అదుర్స్ అనిపించాయి. ఇక దేవి శ్రీ హై స్టాండర్డ్ స్కోర్ ఇచ్చాడు.
న్యూ ఇయర్ గిఫ్ట్ గా వచ్చిన ఈ ట్రెయిలర్ను మీరు ఓ లుక్కేసుకోండి.