‘మొగలి రేకులు’ సీరియల్‌లోని ఆర్కేనాయుడి పాత్రలో నటించి ఫ్యామిలీ ఆడియన్స్‌లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ సొంత చేసుకున్నాడు సాగర్. తర్వాత వెండితెర వైపు వచ్చాడు. ఐతే ఇక్కడ అనుకున్నంత సక్సెస్ రాలేదు. ‘షాదీ ముబారక్’ సినిమాతో మరోసారి తన అదృష్టం పరీక్షించుకోవాలని చూస్తున్నాడు. ఐతే ఇకపై సీరియల్స్ లో నటించనని క్లియర్ గా చెప్పేశాడు సాగర్.
‘సీరియల్స్ నన్ను స్టార్ ని చేశాయి. వాటిలో ఒక రేంజ్ పాత్రలే చేశాను. ఐతే అలా చేసుకుంటూ వెళ్తే తర్వాత చేయడానికి అంత స్థాయిలో పాత్రలు దొరక్కపోవచ్చు. అందుకే సీరియల్స్ మానేసి సినిమాల పైనే దృష్టి పెట్టాను. ఇక సీరియల్స్‌లో నటించే ఉద్దేశం లేదు. దృష్టంతా సినిమాలపైనే ఉంచాను” చెప్పుకొచ్చాడు సాగర్.