సెలబ్రిటీలు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎక్కడ చిన్న మాట దొర్లిన ఇంకా ట్రోల్ అయిపోతాం. అదే కాదు.. ఒక స్టేట్మెంట్ ఇచ్చే ముందు కూడా చాలా అలోలించాలి. లేదంటే ఈ ట్రోల్స్ కాలంలో వీడియోలు వైరల్ అయిపోతాయి. త్రివిక్రమ్ లాంటి మాటల మాంత్రికుడికే ట్రోల్స్ తప్పలేదు. అజ్ఞాతవాసి సినిమా ఆడియో వేడుకలో వేదికపై వున్న అందరినీ ఉద్దేశించి.. నేను అందరి దగ్గరి నుండి కొన్ని కొన్ని నేర్చుకున్నా అని తనదైన శైలిలో ఒక స్పీచ్ ఇచ్చాడు త్రివిక్రమ్. సినిమా ఫ్లాఫ్ అయిన తర్వాత ”అందరి దగ్గరి నుండి అన్నీ నేర్చుకున్నాడు కానీ సినిమా తీయడం మాత్రం నేర్చుకోలేదు” అని మీమ్స్ చేసి వదిలారు అప్పట్లో.
ఇప్పుడు ఇదంతా ఎందుకంటే.. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చాడు. చావు కబురు చల్లగా అనే సినిమాని ఆకాశానికి ఎత్తాడు బన్నీ. ‘తాను చూసాను..అద్దిరిపోయింది. మీరు చూడండి మీకూ నచ్చుతుంది”అని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేశాడు బన్నీ. బేసిగ్గా… పెద్ద హీరోలు సెలబ్రిటీలు సినిమా ఫంక్షన్లకు వచ్చినా, సినిమా ను చూడండి..మీకు నచ్చుతుంది..బాగుంటుంది చెప్పరు. తేడా కొడితే మళ్ళీ ట్రోల్ అయిపోతారు. కానీ బన్నీ ఇప్పుడు అంత నమ్మకంగా చెప్పాడంటే సినిమా బాగా వచ్చిందనే అర్ధం చేసుకోవాలి. చూద్దాం మరి బన్నీ నమ్మకం ఎంత వరకు నిలబడుతుందో