సాహో బిజినెస్ లెక్కలు తికమక పెడుతున్నాయి..

ప్రభాస్ నటించిన భారీ యాక్షన్ మూవీ సాహో ఆగస్టు 15 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సుజిత్ డైరెక్షన్లో యువీ క్రియేషన్స్ బ్యానర్ లో దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో తెలుగు, తమిళ్ , హిందీ భాషల్లో తెరకెక్కుతుంది.

బాహుబలి తర్వాత ప్రభాస్ నుండి వస్తున్న సినిమా కావడం..బాలీవుడ్ బ్యూటీ శ్రద్ద కపూర్ తో పాటు పలువురు బాలీవుడ్ నటి నటులు నటిస్తుండడం తో ఈ సినిమా ఫై నార్త్ లోను అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ స్థాయి లో జరగడమే కాదు..రోజుకో డిస్ట్రిబ్యూషన్ సంస్థల పేర్లు బయటకు వస్తూ అభిమానులను తికమపెడుతున్నాయి.

ఇప్పటికే హిందీ రిలీజ్ హక్కుల్ని ప్రతిష్ఠాత్మక టీ- సిరీస్ చేజిక్కించుకుంది. సాహో అండర్ ప్రొడక్షన్ ఉండగానే ఈ సంస్థ భారీ డీల్ కుదుర్చుకుని అడ్వాన్సులు చెల్లించిందని వార్తలొచ్చాయి. మరోవైపు ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ దిగ్గజం .. దుబాయ్ బేస్డ్ కంపెనీ `ఫార్స్ ఫిలింస్` విదేశీ రిలీజ్ హక్కులు చేజిక్కించుకుందని వార్తొలచ్చాయి. ఇలా రోజుకో సంస్థ పేరు బయటకువస్తుండడంతో ఈ సినిమా కోసం ఎంత పోటీ పడుతున్నారో అర్ధమవుతుంది.