శివరాత్రి నాలుగు సినిమాలొస్తున్నాయి. శ్రీకారం, జాతిరత్నాలు, గాలి సంపత్ తో పాటు.. డబ్బింగ్ సినిమా రాబర్ట్ విడుదల అవుతోంది. డబ్బింగ్ సినిమాని పక్కన పెడితే – ఒకేసారి మూడు కొత్త సినిమాలు, అందులోనూ క్రేజ్ ఉన్న సినిమాలు రావడం సినిమా ప్రేక్షకులు ఫుల్ మీల్స్ అనాలి. మూడు సినిమాలపైనా ప్రత్యేకమైన అంచనాలు ఉన్నాయి. శర్వానంద్ సినిమా అంటే యూత్ లో క్రేజ్ ఉంటుంది. పైగా ఈసారి రైతు సమస్యల నేపథ్యంలో కథ ఎంచుకున్నాడు శర్వా.
జాతి రత్నాలు ఫుల్ ఫన్ రైడ్ గా ఉండబోతోందన్న విషయం ట్రైలర్ చెప్పకనే చెప్పింది. నవీన్ పొలిశెట్టి తన కామెడీ టైమింగ్ బావుటుంది. మరోసారి… తనకు అలవాటైన, పేరు తెచ్చిన జోనర్‌లో `జాతిరత్నాలు` చేశాడు. ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ తోడుగా వస్తున్నారు.
ఇక సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి నిర్మాతగా మారి చేసిన ప్రయత్నం. హార్ట్ టచింగ్ ఎలిమెంట్స్ లో ఈ సినిమా రూపొందదని చెబుతున్నారు. మొత్తానికి మూడు సినిమాలు క్రేజీవే కావడం ఆసక్తికరంగా వుంది.