‘విక్రమ సింహా’ ఎప్పుడంటే..!

rajinikanthసూపర్ స్టార్ రజనీకాంత్‌ హీరోగా భారీ వ్యయంతో తెరకెక్కుతున్న చిత్రం ‘కోచ్చడయాన్‌’. రజినీ కుమార్తె సౌందర్య దర్శకత్వం వహిస్తున్నారు. దీపికా పదుకొనే హీరోయిన్. ఈ సినిమాని తెలుగులో ‘విక్రమ సింహా’గా రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రం రిలీజ్ డేట్ ను ప్రకటించింది ఆ చిత్ర నిర్మాణ సంస్థ. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 11న రిలీజ్ చేయనున్నట్లుఅధికారిక ప్రకటన చేశారు. ఆస్కార్ విజేత రెహ్మాన్ మ్యూజిక్ అందించిన ఈ చిత్రం లోని పాటలను త్వరలో రిలీజ్ చేస్తారు. కోలివుడ్ లో భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం కోసం రజనీ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.