Site icon TeluguMirchi.com

వకీల్ సాబ్ లో మార్పులు లేవు

”ఓ మై ఫ్రెండ్‌’తో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. ఆ సినిమా అనుకున్నంతస్థాయిలో ఆడకపోవడంతో కొన్నేళ్లపాటు ఇంటికే పరిమితమైన దర్శకుడు వేణు శ్రీరామ్‌. మూడో చిత్రం పవర్ స్టార్ ‘వకీల్‌సాబ్‌’తో తన లక్‌ను పరీక్షించుకోవడానికి ఆయన సిద్ధమయ్యడు . తాజాగా విడుదలైన ‘వకీల్‌సాబ్‌’ ట్రైలర్‌ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఐతే ఈ సినిమా కాన్సెప్ట్ ని మార్చార ? అనే సందేహాలు వచ్చాయి. ఐతే దీనిపై దర్శకుడు క్లారిటీ ఇచ్చాడు.

‘పింక్‌’ సినిమాలో మెయిన్‌ కాన్సెప్ట్‌ మహిళా సాధికారికత. బాలీవుడ్‌లో అమితాబ్‌ బచ్చన్‌, తాప్సీ ప్రధాన పాత్రల్లో నటించారు. అదే కథను తమిళ ప్రేక్షకులకు చేరువయ్యేలా కొన్ని మార్పులు చేసి అజిత్‌తో తెరకెక్కించారు. మహిళా సాధికారికత అనే కాన్సెప్ట్‌ను ప్రధానంగా చేసుకుని మరింత ఎక్కువమంది ఆడియన్స్‌కు చేరువయ్యేలా పవన్‌ ఇమేజ్‌ దృష్టిలో ఉంచుకుని కొన్ని అంశాలను జోడించాం. అంతేకానీ, మహిళా సాధికారికత అనే కాన్సెప్ట్‌కు ఎలాంటి ఇబ్బందులు కలిగించలేదు’’అని క్లారిటీ ఇచ్చాడు వేణు శ్రీరామ్. 

Exit mobile version