పింక్‌ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు అనగానే… పవన్ కల్యాణ్ ఇమేజ్ కీ అది సూటవుతుందా? అని అనుమానించారంతా. అయితే.. మెల్లమెల్లగా ఆ అనుమానాలు తీరిపోతూ వచ్చాయి. `వకీల్ సాబ్` ట్రైలర్‌తో వాటిని పూర్తిగా తీర్చేసింది చిత్రబృందం. కేవలం కధని ప్రధానంగా చుపించారు ట్రైలర్ లో.
ఇంతకుముందు టీజర్ సహా ప్రోమోలన్నీ కూడా పవన్ చుట్టూనే తిరిగాయి. అమ్మాయిలకు.. కథాంశానికి చోటెక్కడ అన్న ప్రశ్నలు రేకెత్తించాయి. కానీ ట్రైలర్లో మాత్రం పింక్‌లో కీలకంగా అనిపించిన సన్నివేశాలన్నీ కనిపించాయి. ఈ సినిమా కథాంశాన్ని చెడగొట్టడం లాంటిదేమీ జరగలేదని స్పష్టమైంది.
ఐతే ఇక్కడ ఇంకో టెన్షన్ వుంది. ట్రైలర్ శ్రుతిహాసన్ లవ్ ట్రాక్ మొత్తానికి ఎక్కడా కనిపించలేదు. ఐతే థియేటర్ ఆడియన్స్ కోసం దాచి ఉంచారు అనడానికి లేదు. కారణం పోస్టర్ లో శృతి ని చుపించారు. కానీ ట్రైలర్ లో ఆమెకు స్పేష్ దొరకలేదు. కారణం ఒకవేళ శ్రుతిని చూపిస్తే ఫ్లొకి అడ్డు తగులుతుందని భావించివుంటారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ట్రైలర్ లో అడ్డు తగిలితే సినిమాలో ఆమెను ఎలా సర్దుబాటు చేసి పాత్ర రూపకల్పన చేసి ఉంటారో అనే సందేహాలు వస్తున్నాయి. చూడాలి మరి శృతి ఎంత వరకూ వకీల్ సాబ్ కి సెట్ అవుతుందో..