భారీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ శంకర్. ఇప్పటివరకూ ఆయన ఒక్క తెలుగు హీరోతో కూడా సినిమా చేయలేదు. ఐతే ఇప్పుడు రామ్చరణ్ కథానాయకుడిగాఆయన దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కునుంది. దిల్రాజు నిర్మాతగా ఇటీవల ఈ సినిమాను ప్రకటించారు. కొత్త చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర వార్త టాలీవుడ్లో చక్కర్లు కొడుతోంది.
ఇప్పటివరకూ శంకర్ తీసిన ప్రాజెక్టులన్నీ కనీసం రెండు మూడేళ్లు సాగినవే. ఐతే చరణ్ సినిమా అంత సమయం పట్టదట, ఎట్టిపరిస్థితుల్లోనూ సినిమాను అనుకున్న సమయానికి చేసి తీరాల్సిందేనని అంటున్నారట. ఇదే విషయాన్ని శంకర్ దృష్టికి తీసుకెళ్లారట దిల్ రాజు. దీనికి శంకర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని, ఆలస్యం లేకుండా కేవలం ఆరు నెలల వ్యవధిలో ఈ సినిమా పనులు పుర్తయిపోతాయని టాక్.