రానా బాలీవుడ్ ఆశలపై కరోనా వల

పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కింది అరణ్య. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఒకే రోజు విడుదల చేయాలనేది ప్లాన్. కేవలం ఈ భారీ రిలీజ్ కోసమే సంక్రాంతిని కూడా వదులుకుంది యూనిట్. కానీ వాళ్ల కోరిక నెరవేరలేదు. అరణ్య హిందీ వెర్షన్ విడుదల కావడం లేదు. ఈ మేరకు ఈరోస్ సంస్థ అధికారిక ప్రకటన ఇచ్చింది.

బాలీవుడ్   కోవిడ్ కార‌ణంగా ఈ సినిమా విడుద‌ల‌ని వాయిదా వేస్తున్నామ‌ని చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. నార్త్ లో కోవిడ్ కేసులు పెరిగాయి. ముఖ్యంగా మ‌హారాష్ట్ర‌లో రోజు రోజుకీ కేసులు పెరుగుతున్నాయి. అక్క‌డ ప్ర‌భుత్వ నిబంధ‌న‌లు క‌ఠినంగా ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో థియేట‌ర్లు తెర‌చుకోలేదు. రాత్రిపూట కర్ఫ్యూ కూడా క‌ఠినంగా అమ‌లు అవుతోంది. ఈ నేప‌థ్యంలో.. కొన్ని బాలీవుడ్ సినిమాలు విడుద‌ల‌ని వాయిదా వేసుకుంటున్నాయి.   ఈ క్రమంలో రానా సినిమా కూడా వెనక్కి వెళ్ళింది. 

ReplyForward