జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ ఇటివలే మళ్ళీ చర్చ జరిగింది. ఏపీలో టీడీపీ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. పార్టీ కష్టాల్లో ఉందని.. ఎన్టీఆర్ పార్టీలో క్రియాశీలకంగా మారితే బాగుంటుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో తన పొలిటికల్ ఎంట్రీపై జూనియర్ ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎవరు మీలో కోటీశ్వరుడు.. కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఆ షో ప్రోమో విడుదల కార్యక్రమం హైదరాబాద్లో జరిగింది.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన జూనియర్ ఎన్టీఆర్.. రాజకీయాలు సహా పలు అంశాలపై స్పందించారు. రాజకీయ ప్రవేశం ఎప్పుడు?అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. మీరు చాలా సందర్భాల్లో నన్ను అడిగారు. నేను చెప్పే సమాధానం ఏమిటో మీకు బాగా తెలుసు. ‘ఇది సమయం కాదు.. సందర్భమూ కాదు’. తర్వాత తీరిగ్గా ఓరోజు కాఫీ తాగుతూ మనమే సరదాగా కబుర్లు చెప్పుకుందాం” అని నవ్వేశాడు తారక్. మొత్తానికి రాజకీయాలు ఇది సమయం కాదని తేల్చేశాడు ఎన్టీఆర్.