రష్మిక , విజయ్ దేవర కుటుంబానికి దగ్గర అయ్యిందా ? అంటే అవుననే చెప్పాలి. గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ చిత్రాల్లో నటించి క్యూట్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్నారు విజయ్ దేవరకొండ, రష్మిక. రెండు సినిమాల కోసం స్క్రీన్ పంచుకున్న వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని వార్తలు వచ్చినప్పటికీ పలు సందర్భాల్లో వాటిని ఈ జంట ఖండిచింది.
షూటింగ్స్ తో బిజీగా ఉన్న వీరు చాలారోజుల తర్వాత కెమెరా కంటికి చిక్కారు. సినిమా షూటింగ్స్‌లో భాగంగా ముంబయికి చేరుకున్న విజయ్, రష్మిక నిన్న రాత్రి డిన్నర్ కోసం నగరంలోని ఓ ప్రముఖ రెస్టారెంట్‌కు వెళ్లారు. దీంతో ఈ జంటకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట్లో దర్శనమివ్వడంతో ఈ జంట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.