కాజల్, సమంత, శ్రియ,.. ఇలా ఎంతోమంది హీరోయిన్లు పెళ్లి తర్వాత కూడా తమ కెరీర్ ను కొనసాగిస్తున్నారు. తమ మనసుకు నచ్చిన సినిమాలు చేస్తున్నారు. ఐతే కొందరు మాత్రం పెళ్లి అనే ప్రస్తావన వచ్చిన వెంటనే సినిమాలకు గుడ్ బై చెప్పేస్తారు. ఇందులో మెహ్రీన్ కూడా చేసింది. ప్రస్తుతం ఆమెకు టాలీవుడ్ మంచి క్రేజే ఉంది. ఐతే ఇప్పుడు సినిమాలు వదులుకోవడానికి సిద్ధపడింది ఈ బ్యూటీ.
మొన్ననే తన ప్రేమ విషయాన్ని బయటపెట్టింది మెహ్రీన్. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కుల్దీప్ కొడుకు భవ్య బిష్ణోయ్ ను ప్రేమిస్తున్నట్టు వెల్లడించింది. వచ్చేనెల 12న వీళ్లిద్దరి నిశ్చితార్థం కూడా జరగనుంది. ఇదే ఏడాది ఇద్దరూ పెళ్లితో ఒక్కటవ్వబోతున్నారు. ప్రస్తుతం మహ్రీన్ ఖాతాలో ఎఫ్3 మినహా మరో సినిమాలేదు. ఈ మధ్య కొన్ని అవకాశాలని వదులుకుంది. ఎఫ్3నే ఆమె ఆఖరి సినిమా అని చెబుతున్నారు. మెహరీన్ భర్త వాళ్ళ తరపునుండే ఈ ప్రతిపాదన వచ్చింది. పెళ్లి తర్వాత సినిమాలు వదిలేయాలనే కండీషన్ తోనే ఆమె పెళ్లికి అంగీకారం తెలిపినట్లు చెబుతున్నారు. మొత్తానికి పెళ్లి జీవితం కోసం కెరీర్ కి ఫుల్ స్టాప్ పెట్టేస్తుంది స్వీటీ ఈజ్ ది బెస్ట్.