మిర్యాలగూడలో ప్రణయ్ హత్య ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ ఘటనతో ప్రణయ్-అమృతల ప్రేమకథ ఓ విషాదాంతం అయింది. అమృత తండ్రి మారుతి రావు కిరాయి రౌడీతో ప్రణయ్ని హత్య చేయించాడు. జైలుకి కెళ్ళాడు. బయటికి వచ్చి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ పాయింట్ ఆధారంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘మర్డర్’ అనే సినిమా కూడా తీశాడు. ఇదంతా ‘పరువు” అనే పాయింట్ కారణంగా జరిగిన విషాదం.
సరిగ్గాఇలాంటి పాయింటే ఉప్పెన సినిమాలో కూడా వుంది. పరువు ని ప్రాణంగా ప్రేమించే ఓ తండ్రి తన కూతురు కులం, ధనం తక్కువ వాడిని ప్రేమిస్తే ఏం చేశాడనేది ఉప్పెన సినిమా. ప్రేమించిన యువకుడిని మగతనం లేకుండా చేస్తాడు అమ్మాయి తండ్రి. ఈ పాయింట్ ఎమోషనల్ గా ఎలా వుందో పక్కన పెడితే మీమ్స్ పేజీలు నడిపే సోషల్ మీడియా క్రికెటర్స్ కి భలే కామెడీ గా పనికొచ్చింది. పరువుకోసం ప్రాకులాడే మారుతి రావులు.. ముందు ఉప్పెన సినిమా చూడాలని, ప్రాణం తీసే బదులు మగతనం తీసేస్తే.. అంటూ ఫన్నీగా మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇందులో కొన్ని చాలా నవ్వు తప్పించేవిగా వున్నాయి.. ” తలకాయ కోయడం ఎందుకు.. ఉప్పెన సినిమాని ఫాలో అయితే పోలా” అనే పంచ్ డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియా మీమ్స్ పేజీల్లో విపరీతంగా వైరల్ అవుతుంది. మీమ్స్ క్రియేట్ చేసే వాళ్ళ లక్ష్యం ఒకటే మేటర్ ఎంత సీరియస్ గా వున్నా .. దానితో కామెడీ చేయడమే వాళ్ళ టార్గెట్. ఇప్పుడు ఉప్పెన సినిమా పై ఇలాంటి కామెడీనే చేస్తున్నారు మీమర్స్.