Site icon TeluguMirchi.com

మహేష్ ఓకే కానీ .. పవన్ పై నమ్మకం లేదు బాస్

ప‌వ‌న్ క‌ల్యాణ్ – క్రిష్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఏఎం ర‌త్నం నిర్మాత‌. నిధి అగ‌ర్వాల్ క‌థానాయిక‌. ఈ సినిమా 2022 సంక్రాంతికి విడుద‌ల కానుంద‌ని ముందు నుంచీ ప్ర‌చారం జ‌రుగుతోంది. దాన్ని ఇప్పుడు చిత్ర‌బృందం కూడా ఖ‌రారు చేసింది. ప‌వ‌న్ సినిమాకి 2022 సంక్రాంతికి విడుద‌ల చేస్తున్న‌ట్టు చిత్ర‌బృందం అధికారికంగా ప్ర‌క‌టించింది.  

ఐతే ఇదే సంక్రాంతికి మహేష్ బాబు సర్కారు వారి పాట కూడా విడుదలకు సిద్దంగా వుంది. `గీత గోవిందం`లాంటి హిట్ ఇచ్చిన ప‌ర‌శురామ్ చేస్తున్న సినిమా ఇది. ఈ కాంబో పై బోలెడ‌న్ని అంచ‌నాలున్నాయి. పైగా మ‌హేష్ కి సంక్రాంతి క‌లిసొచ్చిన సీజ‌న్‌. ద‌స‌రాకి ఈ సినిమా విడుద‌ల చేద్దామ‌నున్నార్ట‌. అయితే మ‌హేష్ మాత్రం ప‌ట్టుబ‌ట్టి.. సంక్రాంతి సీజ‌న్ కి తీసుకొస్తున్నాడు. ఇప్పుడు అవన్ మూవీ ప్రకటన కూడా వచ్చేసింది. దీంతో అప్పుడే మీడియా లో వార్తలు మొదలైయ్యాయి.

ఐతే ఇక్కడ చిన్న అనుమానం. సర్కారు వారి పాట సంగతి ఏమో కానీ పవన్ కళ్యాణ్ సినిమావిడుదల పై అంత నమ్మకం లేదనే మాట వినిపిస్తుంది. పవన్ కళ్యాణ్ ఇప్పుడు రెండు పడవల ప్రయాణం చేస్తున్నారు. సినిమా, రాజకీయం. ఒకవేళ ఏవో పరిస్థితి లు అనుకూలించక ఆయన రాజకీయాల్లో బిజీ పర్యటనలతో గడిపితే మళ్ళీ షూటింగ్ వాయిదా పడటం అనుకున్న సమయానికి రాకపోవడం జరగొచ్చు. కానీ దర్శకుడు క్రిష్ చాలా ప్లాన్ గా వున్నారు. ఐతే పవన్ కళ్యాణ్ డైరీ ఎప్పుడు ఎలా వుంటుందో తెలీదు.  అందుకే పవన్ సినిమా ప్రకటన వచ్చినప్పటికీ పక్కా అని చెప్పలేం అంటున్నారు కొందరు నెటిజన్స్. 

Exit mobile version