Site icon TeluguMirchi.com

‘మహర్షి’ సినిమా పై అప్పల్రాజు కామెడీ

కేంద్రం ప్రక‌టించిన 67వ జాతీయ అవార్డుల‌లో ద‌క్షిణాది చిత్రాలు హ‌వా చూపించాయి. సింహ భాగం అవార్డులు ద‌క్షిణాదికే ద‌క్కాయి. స్వత‌హాగా మ‌ల‌యాళ చిత్రాల ప్ర‌భావం జాతీయ అవార్డుల్లో ఎక్కువ‌గా క‌నిపిస్తుంది. ఈసారి త‌మిళ‌, తెలుగు చిత్రాలూ… త‌మ ప్రతాపం చూపించాయి. ఈసారి తెలుగు సినిమాల‌కు ఏకంగా 4 అవార్డులు ద‌క్క‌డం విశేషం. అందులో జెర్సీ, మ‌హ‌ర్షి చిత్రాలు చెరో రెండు అవార్డులు పంచుకున్నాయి. ఉత్త‌మ తెలుగు చిత్రం (జెర్సీ), ఉత్త‌మ ఎడిట‌ర్ (న‌వీన్ నూలి -జెర్సీ), ఉత్త‌మ కొరియోగ్ర‌ఫీ (రాజు సుంద‌రం – మ‌హ‌ర్షి), ఉత్తమ వినోదాత్మక చిత్రం (మ‌హ‌ర్షి)… జాతీయ అవార్డుల‌లో స్థానం ద‌క్కించుకున్నాయి.

అంతాబాగానే వుంది కానీ ఉత్తమ వినోదాత్మక చిత్రం కేటగిరీలో మ‌హ‌ర్షి సినిమాకి అవార్డ్ రావడం కొంచెం వెరైటీగా వుంది. నిజానికి మహర్షి సినిమా సందేశాత్మక చిత్రం. వీకెండ్ వ్యవసాయమని కాన్సెప్ట్ ఎత్తుకొని దాన్ని మెసేజ్ ఓరియంటెడ్ గా తీర్చిదిద్దారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో కూడా సందేశాత్మక చిత్రంగానే  జనాల్లోకి తీసుకెళ్ళారు. తీరా చుస్తే వినోదాత్మక కేటగిరీలో మహర్షికి అవార్డ్ ఇచ్చారు. దీనిపై సోషల్ మీడియాలో సెటైర్లు కూడా మొదలయ్యాయి . రామ్ గోపాల్ వర్మ కధ స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పలరాజు అనే సినిమా తీశాడు. ఇందులో అప్పల్రాజు హెవీ సెంటిమెంట్ వున్న ఓ విషాద చిత్రం తీస్తాడు. తీరా చుస్తే ఈ సినిమా ఉత్తమ కామెడీ సినిమా అవార్డ్ వస్తుంది. ఇప్పుడు మహర్షి సినిమా పరిస్థితి కూడ అలానే వుందని మీమర్స్ తెగ హడావిడి చేస్తున్నారు. 

Exit mobile version