Site icon TeluguMirchi.com

మళ్ళీ ప్రమాదం అంచున సినీ పరిశ్రమ

పాకిస్తాన్ పై కోపం వస్తే వాళ్లతో క్రికెట్ మ్యాచ్ ఆపేసినట్లు కరోనా మాట వినిపిస్తే చాలు సినిమా థియేటర్లు మూసేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఒక లాక్ డౌన్ తో చిత్ర పరిశ్రమ చితికిపోయింది. ఈ మధ్యనే థియేటర్లు ప్రారంభమయ్యాయి. సినిమా రిలీజులు.. ఊపందుకుటున్నాయి.  ఇలాంటి సమయంలో మళ్లీ కరోనా వచ్చి పడుతోంది సెకండ్ వేవ్ వచ్చేసింది.

దేశం మొత్తం అప్రమత్తమయింది.   ప్రభుత్వాలు ఆంక్షల దిశగా చర్చలు ప్రారంభించాయి. మెట్రో నగరం ఉన్న తెలంగాణలో ముందుగా ఆంక్షలు విధించడం ఖాయంగా కనిపిస్తోంది. సీఎం కేసీఆర్ ఈ అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.  ఇపటికే స్కూల్స్ మూసేస్తున్నట్లు ప్రకటన వచ్చేసింది.

ఇకపై ఎలాంటి ఆంక్షలు విధించినా.. మొదటగా అధికారలకు గుర్తుకు వచ్చేది సినిమాహాళ్లు. సినిమా హాళ్లలో ఆక్యుపెన్సీని పరిమితం చేసే దిశగా తొలి నిర్ణయం తీసుకోవచ్చు.  ఇప్పుడిప్పుడే కోలుకుటున్న సమయంలో… కరోనా ఆంక్షలు మరోసారి  సినీ పరిశ్రమని చిద్రం చేస్తాయని చెప్పవచ్చు. 

Exit mobile version