Site icon TeluguMirchi.com

మళ్లీ ప్రేమలో ఓడిన నయన్‌…!!

nayan news
నయనతార కెరియర్‌ పరంగా అగ్ర స్థానంతో దూసుకుపోతున్న కూడా వ్యక్తిగతంగా మాత్రం పరాజయం పాలు అవుతూనే ఉంది. నయన్‌ చిత్రాలు ఎంతటి ఘన విజయం సాధిస్తాయే వ్యక్తిగత జీవితంలో ప్రేమలో ఓడిపోతూనే ఉంటుంది. ఈ అమ్మడు ఇప్పటికే హీరో శింబుతో ప్రేమాయణం సాగించి ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఇద్దరు బ్రేకప్‌ అయ్యారు. ఆ తర్వాత ఈ అమ్మడు ప్రభుదేవాతో ప్రేమలో పడింది. ఆ ప్రేమ పెళ్లి వరకు పోయింది. కాని చివరి క్షణంలో సీన్‌ అంతా రివర్స్‌ అయ్యి పీఠల దాకా వచ్చిన నయన్‌ పెళ్లి ఆగిపోయింది. ప్రేమలో ఘోరంగా ఓడిపోయిన నయనతార పూర్తిగా సినిమాలపై దృష్టి పెట్టింది. కొంతకాలం తర్వాత ఈ అమ్మడు మళ్ళీ షాక్‌ ఇచ్చింది.

ప్రేమ విషయంలో వరుసగా ఓడిపోతున్నా కూడా నయన్‌ దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌ ప్రేమలో పడింది. గత కొంతకాలం నుండి ఇద్దరు ప్రేమలో ఉన్నారు. అంతేకాకుండా ఇద్దరు ఒకే ఫ్లాట్‌లో సహజీవనం కూడా చేస్తూ వచ్చారు. కానీ తాజాగా నయన్‌ ఈ సారి కూడా ప్రేమలో ఓడిపోయినట్టు సమాచారం అందుతోంది.

చాలాకాలం నుండి విఘ్నేష్‌తో సహజీవనం చేస్తున్న నయన్‌ తాజాగా విఘ్నేష్‌ ఫ్లాట్‌ నుండి బయటకు వచ్చి ఓ స్టార్‌ హోటల్‌లో ఉంటుందట. అందుకు కారణం విఘ్నేష్‌తో విభేదాలే. నయన్‌, విఘ్నేష్‌ మద్య చిన్న చిన్న విభేదాలు కాస్త పెద్దగా అయ్యి చివరకు బ్రేకప్‌ వరకు వచ్చిందట. అయితే ఈ విషయంపై నయన్‌ కాని విఘ్నేష్‌ కాని స్పందించలేదు. నయన్‌ మళ్లీ ప్రేమలో ఓడిపోయింది అని ఈమె సన్నిహితుల నుండి సమాచారం అందుతోంది.

Exit mobile version