Site icon TeluguMirchi.com

మనోజ్ మళ్ళీ మ్యారేజ్ .. నిజమేనా ?

మంచు మనోజ్‌ రెండో పెళ్లి చేసుకోబోతున్నారంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలె విడాకుల ప్రక్రియ కూడా పూర్తయింది. దీంతో మనోజ్ మరోసారి పెళ్లిపీటలెక్కనున్నట్లు  సమాచారం. అయితే మనోజ్‌ రెండో పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి ఎవరనే ప్రచారం సోషల్‌ మీడియాలో జోరుగా సాగుతోంది.

 మోహన్‌బాబు కుటుంబానికి దగ్గరి బంధువైన అమ్మాయితోనే మనోజ్‌ వివాహం జరగనుందని తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉందని  చెబుతున్నారు. 

Exit mobile version