బాహుబలి సినిమా మొదలైనప్పుడు ఈ సినిమా రెండు పార్టులుంగా చేయాలనే ఆలోచన రాజమౌళికి లేదు. మొదలైన తర్వాత కాన్వాజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ప్యాన్ ఇండియా సినిమా అయిపొయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా విషయంలో కూడా ఇదే జరుగుతుంది. పవన్ కల్యాణ్ – క్రిష్ కాంబినేషన్ లో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. దీనికి `హరి హర వీరమల్లు` అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ఈవారంలోనే కొత్త షెడ్యూల్ మొదలు కాబోతోంది.
మూవీలో పవన్ కల్యాణ్ 17వ శతాబ్దానికి చెందిన వజ్రాల దొంగగా కనిపించబోతున్నాడు. దీంతో పాటు సినిమాలో మొఘల్ పాలన, ఔరంగజేబు అరాచకాలు, సిక్కుల పోరాటం లాంటి నేపధాలు ఉన్నాయి. ఇవన్నీ వీరమల్లు సినిమాకు పాన్ ఇండియా అప్పీల్ తీసుకొస్తాయని టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్, అర్జున్ రాంపాల్ లాంటి బాలీవుడ్ నటులు కూడా నటిస్తున్నారు. దీంతో సినిమాని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయాలనీ భావిస్తున్నారు. క్రిష్ కి బాలీవుడ్ లో కూడా పేరుంది. అక్షయ్ కుమార్, కంగనా లతో వందల కోట్ల సినిమాలు తీసిన దర్శకుడు క్రిష్. ఇప్పుడు పవన్ సినిమా కూడా పెద్ద ఎత్తున తీయడానికి సిద్దమౌతున్నారని భోగట్ట. మొదట ఈ సినిమాని టాలీవుడ్ కే పరిమితం చేయాలనీ చూశారు. ఐతే ఇప్పుడు ఈ సినిమాకి పాన్ ఇండియా మార్చాలనే ఆలోచన వున్నారు పవన్ కళ్యాణ్ అండ్ టీమ్.