రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కి విడుదలైన ‘బాహుబలి’ సంచలన విజయం సాధించడంతో రెండవ పార్ట్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆ అంచనాలను అందుకునేలా జక్కన్న రెండవ పార్ట్‌ను కూడా తెరకెక్కించాడు. మొదటి పార్ట్ దాదాపుగా ఏడు వందల కోట్లను వసూళ్లు చేసిన నేపథ్యంలో రెండవ పార్ట్ ఏకంగా వెయ్యి కోట్లను వసూళ్లు చేయాలని జక్కన్న పట్టుదలతో ఉన్నాడు. అందుకోసం భారీ పబ్లిసిటీ చేయాలని, విడుదలకు ముందే సినిమాకు హై రేంజ్లో హైప్‌ను తీసుకు రావాలని భావిస్తున్నాడు.
ఒక్క తెలుగులోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఈ సినిమాకు అత్యధిక పబ్లిసిటీని చేయాలని నిర్ణయించాడు. అందుకే ఈ చిత్రం ట్రైలర్‌ను ముంబయిలో జాతీయ మరియు అంతర్జాతీయ మీడియా సమక్షంలో విడుదల చేసేందుకు జక్కన్న ప్రయత్నాలు చేస్తున్నాడు. అందుకోసం ఈనెల 15న ముంబయిలో భారీగా మీడియా సమావేశం ఏర్పాటు చేయబోతున్నాడు.
ఈ మీడియా సమావేశంలో ప్రభాస్, రానా, రాజమౌళి, కరణ్ జోహార్, అనుష్క, తమన్నా, నిర్మాతలు ఇంకా పలువురు టెక్నీషియన్స్ కూడా పాల్గొనబోతున్నారు. అదే రోజు సినిమా ప్రమోషన్ ప్లాన్‌ను కూడా జక్కన్న వివరించబోతున్నట్లుగా తెలుస్తోంది. వచ్చే నెల 28న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు జక్కన్న ప్లాన్ చేశాడు. అందుకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా శరవేగంగా జరుగుతుంది.