‘బాహుబలి 2’ వల్ల కన్నడ లోకల్‌ స్టార్స్‌ సైతం నోరెళ్లబెడుతున్నారు

Baahubali2-theatersతెలుగులో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ‘బాహుబలి 2’ చిత్రం కోసం ఇక్కడ మాత్రమే కాకుండా పలు భాషల్లో కూడా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక సినిమా రిలీజ్‌ అవ్వకముందే రికార్డులను నమోదు చేస్తుంది. పరభాష చిత్రమైనా కూడా ఇతర భాషల్లో రికార్డుల మోత మోగిస్తుంది. కన్నడలో ఈ చిత్రం విడుదలవుతుందా లేదా అని సందేహంగా ఉండగా రాజమౌళి మరియు సత్యరాజ్‌లు కన్నడ ప్రేక్షకులను ఒప్పించారు. ఎట్టకేలకు కర్నాటకలో ‘బాహుబలి 2’ విడుదలకు అడ్డంకులు తొలగిపోయాయి. కాగా ఈ చిత్రం కన్నడలో క్రేజీగా మారి అత్యధిక థియేటర్‌లలో విడుదల కాబోతుంది.

కర్నాటకలోని 70శాతం థియేటర్లలో ‘బాహుబలి 2’ విడుదల కాబోతుంది. కన్నడ స్టార్‌ హీరోల చిత్రాలే ఇన్ని థియేటర్లలో విడుదల కాలేదు. అలాంటిది పరభాషా చిత్రమైన ‘బాహుబలి’ అత్యధిక థియేటర్లలో విడుదల కాబోతుండడంతో లోకల్‌ స్టార్లంతా కూడా నోరెళ్లబెడుతున్నారు. విడుదలవడమే కష్టం అనుకున్న కన్నడ ‘బాహుబలి 2’ చిత్రం విడుదలకు ముందే రికార్డులను సొంతం చేసుకుంటుంది. ఏ చిత్రం ఇంతవరకు విడుదల కానన్ని థియేటర్లలో మొదటి సారిగా ‘బాహుబలి 2’ కన్నడలో విడుదల కాబోతుంది.