Site icon TeluguMirchi.com

బన్నీ ఆవేశం లో అర్ధం వుంది


నిర్మాత బన్నీ వాసు కి కోపం వచ్చింది. దీనికి కారణం ఆయన సినిమా పై జరుగుతున్న నెగటివ్ పబ్లిసిటీ. బన్నీ వాసు నిర్మించిన తాజా సినిమా చావు కబురు చల్లగా . ఈ సినిమా మంచి అంచనాలే వున్నాయి . ఐతే ఈ సినిమా విడుదలైన పది రోజులకే ఆహ ఓటీటీ లో కి వచ్చేస్తుందని ప్రచారం మొదలైయింది. దింతో బన్నీ వాసుకి కోపం వచ్చింది . 
ఓ సినిమా విడుద‌లైన రెండు వారాల‌కే ఓటీటీలో చూడొచ్చంటే… థియేట‌ర్ల‌కు వెళ్లేదెవ‌రు..?  ఓటీటీలో చూసుకోవచ్చులే… అని లైట్ తీసుకుంటారు. దాంతో వ‌సూళ్లు త‌గ్గిపోతాయి. ఆ స్థానంలో ప‌క్క‌న ఆడుతున్న మ‌రో సినిమాకి జ‌నాలు వెళ్లిపోతారు.


అందుకే ఈ ప్రచారం సీరియస్ గా తీసుకున్న బన్నీ వాసు “కోవిడ్ టైమ్‌లో ఓటీటీకి ఇవ్వ‌మ‌ని చాలా ఆఫ‌ర్లు వ‌చ్చాయి. కానీ..మా సినిమా  థియేట‌ర్ల‌లోనే చూపిద్దామ‌నుకున్నాం. అందుకే ఆగాం. విడుద‌లైన త‌ర‌వాత కూడా.. దాని రేంజ్ ని బ‌ట్టి నాలుగువారాలు ఆగాలా?  ఆరు వారాలు ఆగాలా? అనేది నిర్ణ‌యించుకుంటాం. రెండు వారాల‌కే ఓటీటీకి ఇవ్వాల‌న్న ఆలోచ‌న మాకెప్పుడూ రాలేదు.ఇది తప్పుడు ప్రచారం “ అంటూ బ‌న్నీ వాస్ ఫైర్ అయ్యారు . నిజమే బన్నీ వాసు ఆవేశంలో అర్ధం వుంది . 

Exit mobile version