ప్రియదర్శి రిస్క్ అవసరమా ?


ప్రియదర్శి పెళ్లి చూపులుకి ముందు ఎవరికీ తెలీదు . పెళ్లి చూపులు తర్వాత ప్రియదర్శి ఒక్కసారిగా అందరికీ పరిచయం అయ్యాడు . ఈ సినిమా తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేదు . ఈ సినిమా దశ మార్చేసింది. ఇప్పుడు ప్రియదర్శి తెలుగు సినిమా పరిశ్రమ లో కామెడీ రత్నం . ఇలాంటి నేపధ్యం లో రూటు మార్చే ప్రయత్నం చేస్తున్నాడు . దర్శకత్వం వైపు అడుగులు వేస్తున్నాడు . “ఒక కహాని లాక్ చేశా . దర్శకత్వం నేనే. త్వరలోనే వివరాలు ప్రకటిస్తా ” అని వెల్లడించాడు దర్శి .
ప్రతి నటుడు కి మెగా ఫోన్ పై కన్ను వుంటుంది . అలాగే దర్శి కి కూడా ఉండటం సహజం . ఐతే ఇక్కడ చిన్న రిస్క్ వుంది. సినిమా హిట్ ఐతే ఓకే కానీ ప్లాప్ ఐతే మాత్రం కమెడియన్ కెరీర్ కి ఇబ్బంది. వెన్నెల కిశోర్ కూడా ఇలానే ఫామ్ లో వున్నపుడు దర్శకత్వం చేశాడు . సినిమా ప్లాప్ . మళ్ళీ తేరుకోవడానికి చాలా సమయం పట్టింది. ఇప్పుడు ప్రియదర్శి కూడా అలంటి రిస్క్ చేస్తున్నాడు . హిట్ కావాలనే కోరుకుందాం.