యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ , నాగ్ అశ్విన్ సినిమా సెట్స్ పైకి వెళ్ళడానికి రెడీ అవుతుంది, మహానటి లాంటి గొప్ప సినిమా తర్వాత నాగ్ అశ్విన్ తీయబోయే చిత్రమిది. పైగా వైజయంతీ మూవీస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏకంగా రూ.400 కోట్ల బడ్జెట్ పెడుతోందీ చిత్రానికి. అలాగే ఆదిత్య 369 తరహాలో సైంటిఫిక్ థ్రిల్లర్గా, హాలీవుడ్ స్థాయికి ఏమాత్రం తగ్గని రీతిలో ఈ సినిమాను తీర్చిదిద్దనున్నట్లు సంకేతాలు అందుతున్నాయి.
తాజాగా ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు నాగి ఈ సినిమా ప్రి ప్రొడక్షన్కు చాలా సమయం పట్టేలా ఉండటంతో ఇంకా లేటుగా సినిమాను మొదలు పెడుతున్నామని చెప్పాడు. ఏడాదికి పైగా ఈ సినిమాకు ప్రి ప్రొడక్షన్ కోసమే కేటాయిస్తున్నామని.. ఈ సినిమా కోసం ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించాల్సి ఉందని చెప్పాడు.
ఐతే ఈ కొత్త ప్రపంచం కాన్సెప్ట్ పై ఓ కామెంట్ వినిపిస్తుంది. ఇటివలే పిట్టకధలు అనే సిరిస్ లో ఓ కధకు దర్శకత్వం వహించాడు నాగి. శృతిహాసన్ లీడ్ లో వచ్చిన ఈ కధ కోసం ఓ కొత్త ప్రపంచం సృస్టించాడు. ఇది పెద్దగా అర్ధం కాలేదు. ఇక ప్రభాస్ సినిమా కి కూడా కొత్త ప్రపంచం అంటున్నాడు. ఐతే ప్రభాస్ సినిమా మాత్రం అందరికీ అర్ధమయ్యే మాస్ ఎలిమెంట్స్ తోనే ఉంటుందని భావించవచ్చు.