బిగ్ బాస్ ఫేం హారిక తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించినప్పుడే చిన్న అనుమానం. ఇంత చిన్నపిల్ల(ఆమెకు బిగ్ బాస్ లో చిన్న పిల్ల ఇమేజే వుంది) అంత పెద్ద భాద్యత మోయగలదా ? అని. ఇప్పుడు ఈ అనుమానం నిజమైయింది. ఆమెను సొంత పెత్తనం మీద నియమించిన టీఆర్ఎస్ నేత.. తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తాకు .. పెద్దలు మొట్టికాయలు వేశారు. ఆయన తీరుపై సీఎంవో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హారికను టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా తొలగించేశారు. టూరిజం శాఖ ఉన్నతాధికారులు టూరిజం శాఖ వెబ్ సైట్ నుంచి హారిక వివరాలని ను తొలగించారు.
మహిళా దినోత్సవం సందర్భంగా కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా దేత్తడి హారికకు పదవి ప్రకటించి నియామక పత్రం అందించారు. ఈ నియామకం గురించి ప్రభుత్వ పెద్దలకు కూడా సమాచారం లేదు. దీనిపై సీఎంవో కు ఫిర్యాదులు అందాయి. వెంటనే… సీఎంవో నుంచి హారిక నియామాకాన్ని నిలిపివేసి.. ఉత్తర్వులను రద్దు చేయాలని ఆదేశాలు వెళ్ళాయి. ఆమె టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా నియమించేంత సెలబ్రిటీ కాదని.. ప్రభుత్వ పెద్దలు భావించారన్న ఇన్ సైడ్ టాక్.