Site icon TeluguMirchi.com

పాపం… ఆవేశంలో నోరు పారేసుకున్న తమన్నా

మిల్కీబ్యూటి తమన్నా ‘బాహుబలి 2’ చిత్రంలో నటించింది. కొన్ని ఇంటర్య్వూలలో ఈ అమ్మడు క్లైమాక్స్‌లో తనదే కీలక పాత్ర అని చెప్పుకొచ్చింది. కానీ మొదటి పార్టులో ఉన్నంత ప్రాధాన్యత రెండో పార్టులో తమన్నాకు లేదు. దాంతో ఈ అమ్మడు ఫీలయి కనీసం ప్రమోషన్‌లో పాల్గోనలేదు. రెండో పార్టులో తన ప్రాధాన్యతను తగ్గించిన రాజమౌళితో తమన్నా గొడవ కూడా పడిరదట. అందుకే ప్రమోషన్‌కు వారు పిలవలేదు, ఈమె రాలేదు. ముందుగా చెప్పినట్టు క్లైమాక్స్‌లో తమన్నా పాత్ర కీలకం అని భావించిన అభిమానులకు నిరాశే మిగిలింది. దాంతో ఒక తమిళ మీడియా సంస్థ తమన్నాకు ఫోన్‌ చేసి మరీ నీ పాత్రకు పెద్దగా ప్రాదాన్యత ఏం లేదుగా అని అడిగాడట.

ఇక ఆవేశంతో అవును, రాజమౌళి హర్ట్‌ చేశాడు. ముందుగా చెప్పినట్టు చేయలేదు అంటూ తమన్నా ఆవేశంలో నోరు పారేసుకుంది. ఆ తర్వాత మళ్లీ మీడియాకు కాల్‌ చేసి ఆ విషయం ఇప్పుడే బయట పెట్టకండి ప్లీజ్‌ అంటూ మీడియాను కోరిందట. అంటే రాజమౌళి తనను బాదపెట్టాడని తమన్నా లోపల బాదపడుతున్నా కూడా బయటకు మాత్రం అలాంటిది ఏం లేదు అంటూ కవర్‌ చేస్తోంది. పాపం తమన్నా ఆవేశంలో నోరు పారేసుకుని ఇప్పుడు నాలుక కరుచుకుంటుంది.

Exit mobile version