పవన్ గురించి అడిగిన అభిమానులతో చెర్రీ… బాబాయ్‌కు మీరందరు అండగా నిలవాలి, అది రాజకీయంగా అయినా మరే రకంగా అయినా కూడా బాబాయ్‌కు మీ సపోర్ట్ ఉండాలి అని చెప్పుకొచ్చాడు. సినిమాలతో చాలా బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ త్వరలో పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న విషయం తెల్సిందే. పవన్ అంటే విరుచుకు పడే మెగా ఫ్యామిలి ఇప్పుడు పవన్‌పై సానుకూలంగానే స్పందిస్తున్నారు. ఎందుకు త్వరలో పవన్ పార్టీలోకి చిరు అండ్ ఫ్యామిలి కూడా వస్తారా ఏంటి..?? లేకపోతే పవన్ గురించి చెర్రీ ఇంత పాజిటివ్‌గా, పరోక్షంగా మెగా ఫ్యామిలి అందరికి కూడా సపోర్ట్‌గా ఉండాలని ముందుగానే అభిమానులను సిద్దం చేస్తున్నాడు. తాజాగా చరణ్ వ్యాఖ్యలు ప్రేక్షకుల్లో గందరగోళంగా మారాయి.