పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ అంటే అమితమైన ఇష్టంతో చాలా చిన్న వయస్సులోనే ఆయనకు దగ్గరయిన రేణూ దేశాయ్ పవన్‌ను పెళ్లి చేసుకోక ముందే కొడుకుకు జన్మనిచ్చింది. అనంతరం చిరు రాజకీయ అరంగేట్రం కారణంగా పవన్‌ను రేణూ మెడలో తాళికట్టాడు. పెళ్లైన తర్వాత పవన్, రేణూలు కొన్నాళ్లు మాత్రమే కలిసి ఉన్నారు. తర్వాత పలు విభేదాల కారణంగా తన ఇద్దరు పిల్లలను తీసుకుని పవన్‌కు విడాకులు ఇచ్చి రేణూ దేశాయ్ పవన్‌కు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఆ తర్వాత పవన్ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని ఉంటున్నాడు. తాజాగా మహిళా దినోత్సవం కారణంగా రేణూ దేశాయ్ ఓ ఇంటర్య్వూలో పాల్గోంది. అందులో తనకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను కూడా చాలా బయట పెట్టింది.
భర్తగా పవన్‌కు పది మార్కులకు గాను మీరు ఎన్ని మార్కులు ఇస్తారంటే రేణు ఏ మాత్రం ఆలోచించకుండా కేవలం మూడు లేదా నాలుగు మార్కులు మాత్రమే అని చెప్పేసింది. రేణూ చేసిన ఈ వ్యాఖ్యలు విని యాంకర్‌తో సహా అంతా షాక్ అవుతున్నారు. విలువలను అమితంగా పాటించే పవన్ భర్తగా తన భాద్యతలను సరిగా నిర్వర్తించలేదా అని సందేహాలు వస్తున్నాయి. భర్త విషయం పక్కన పెడితే పిల్లల విషయంలో ఎన్ని మార్కులు అంటే పిల్లలంటే పవన్‌కు చాలా ఇష్టం. ఆ విషయంలో పదికి వంద మార్కులు ఇస్తాను అని నవ్వుతూ చెప్పుకొచ్చింది. ఇక పవన్ ఒక రాజకీయ నాయకుడిగా పదికి పది మార్కులను పొందడానికి అర్హుడు, ఆయనకు సేవాభావం చాలా ఎక్కువ అంటూ ఈ అమ్మడు పవన్ గురించి చాలా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నాయకుడిగా, తండ్రిగా సమర్థవంతంగా ఉండే పవన్ భర్తగా సరిగా ఉండలేడా..?? అందుకే ఆ విషయంలో రేణూ పవన్‌ను కించపరిచేలా మాట్లాడిరది అని పవన్ అభిమానులు భావిస్తున్నారు.