నైట్‌ ఇస్మార్ట్‌ పార్టీలో హీరోయిన్స్‌తో వర్మ రచ్చ

పూరి జగన్నాధ్‌ దర్శకత్వంలో తెరకెక్కి తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ చిత్రం పాజిటివ్‌ రెస్పాన్స్‌ను దక్కించుకుంది. దాంతో ఈ చిత్ర యూనిట్‌ సభ్యులు చాలా సంతోషంగా ఉన్నారు. ఇప్పటికే సక్సెస్‌ వేడుక చేసుకున్నారు. ఇక ఈ చిత్రం సక్సెస్‌పై మొదటి నుండి కూడా చాలా నమ్మంగా ఉన్న రామ్‌ గోపాల్‌ వర్మకు చిత్ర యూనిట్‌ సభ్యులు పార్టీ ఇచ్చారు. హైదరాబాద్‌లోని ఒక క్లబ్‌లో నైట్‌ పార్టీని పూరి, వర్మ అండ్‌ చిత్ర యూనిట్‌ సభ్యులు ఎంజాయ్‌ చేశారు. ఆ సందర్బంగా రామ్‌ గోపాల్‌ వ్యవహరించిన తీరు అందరికి ఆశ్చర్యంగా ఉంది.

షాంపైన్‌ బాటిల్‌ నెత్తిన పోసుకుంటూ నాకు మామూలుగా అయితే పిచ్చి లేదు, కాని ఇస్మార్ట్‌ శంకర్‌ చూసిన తర్వాత పిచెక్కింది అంటూ ఆ వీడియోను స్వయంగా రామ్‌ గోపాల్‌ వర్మ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. ఇక హీరోయిన్స్‌ నభా నటేష్‌ మరియు నిధి అగర్వాల్‌ లపై కూడా వర్మ షాంపైన్‌ పోయడం జరిగింది. ఇక నిర్మాత అయిన ఛార్మిపై ముద్దుల వర్షం కురిపించాడు. మొత్తానికి ఇస్మార్ట్‌ శంకర్‌ సక్సెస్‌ అంటూ వర్మ చేసిన ఎంజాయ్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తోంది. వర్మ చేసిన హడావుడి ఇక్కడ వీడియోల్లో చూడవచ్చు.